Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్Australia Vs England: తొలి వన్డేలో ఆసీస్ గెలుపు

Australia Vs England: తొలి వన్డేలో ఆసీస్ గెలుపు

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఇచ్చిన 288 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ బ్యాట్స్ మెన్ 46.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సాధించారు.

అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ 31 పరుగులకే మూడు వికెట్లు (సాల్ట్-16; జేసన్ రాయ్-6;  జాన్ విన్స్-5) కోల్పోయింది. బిల్లింగ్స్ కూడా 17 స్కోరు చేసి ఔటయ్యాడు. డేవిడ్ మలాన్ 128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 134 పరుగులు చేసి సత్తా చాటాడు.  కెప్టెన్ జోస్ బట్లర్-29; డేవిడ్ విల్లె-34 పరుగులు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 287 పరుగులు చేసింది.

ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమ్మిన్స్, జంపా చెరో మూడు; స్టార్క్, స్టోనిస్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు తొలి వికెట్ కు 147 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. ట్రావిస్ హెడ్-69 (57 బంతులు, 10 ఫోర్లు 1 సిక్సర్); డేవిడ్ వార్నర్ 86 (84 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్సర్ ) పరుగులతో రాణించగా, స్టీవెన్ స్మిత్ 78 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్సర్ తో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలెక్స్ కారీ- 21 స్కోరు చేసి పెవిలియన్ చేరగా…. కామెరూన్ గ్రీన్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లె రెండు; క్రిస్ జోర్డాన్, లియామ్ డాసన్ చెరో వికెట్ సాధించారు.

134 పరుగులతో రాణించిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మ్యాన్ డేవిడ్ మలాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్