Saturday, November 23, 2024
HomeTrending Newsవీరవనిత ఐలమ్మకు సీఎం కేసీఆర్ నివాళి

వీరవనిత ఐలమ్మకు సీఎం కేసీఆర్ నివాళి

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ., బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక ..అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు నివాళులర్పించారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో ఆమె సేవలను సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని సీఎం అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని సీఎం అన్నారు.

హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి తో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తున్నదని సీఎం తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని సీఎం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్