బంగ్లాదేశ్ తో జరుగుతోన్న తొలి టెస్ట్ లో ఇండియా పూర్తి ఆధిపత్యం సంపాదించి గెలుపు దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాను 150 పరుగులకే ఆలౌట్ చేసిన ఇండియా తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 258 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొత్తంగా 512 ఆధిక్యం సంపాదించింది. శుభ్ మన్ గిల్ , పుజారా సెంచరీలతో కదం తొక్కారు. పుజారా సెంచరీ పూర్తి కాగానే కెప్టెన్ రాహుల్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
8 వికెట్లకు 133 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తో నేడు మూడోరోజు ఆట మొదలు పెట్టిన బంగ్లా మరో 13 రన్స్ మాత్రమే సాధించి మిగిలిన రెండు వికెట్లూ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో రాణించాడు. సిరాజ్ మూడు; అక్షర్, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
254 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా తొలి వికెట్ కు 70 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ 23 పరుగులు చేసి అవుట్ కాగా, గిల్-పుజారా రెండో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేశారు. 110 పరుగులు చేసి అవుట్ కాగా, పుజారా-102; విరాట్ కోహ్లీ 19 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.
మూడోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్ట పోకుండా 42పరుగులు చేసింది.
Also Read : India 404, Bangla 133/8: పట్టుబిగించిన ఇండియా