Sunday, November 24, 2024
HomeTrending Newsహెటిరో డ్రగ్స్ లో 142 కోట్ల నగదు సీజ్

హెటిరో డ్రగ్స్ లో 142 కోట్ల నగదు సీజ్

హెటిరో సంస్థల్లో 4 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఆదాయపన్ను శాఖ. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలను హెటిరో ధ్వంసం చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి చాలా వరకు నకిలీ ఇన్ వాయిస్ లు తయారు చేసినట్లుగా ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాల్లో తేలింది. హెటిరో డ్రగ్స్ యాజమాన్యం కంపెనీ డబ్బులతో భారీగా స్థలాలు కొనుగోలు చేసింది. సోదాల్లో 16 బ్యాంకు లాకర్లను గుర్తించిన ఐటీ అధికారులు. రూ.142 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు లెక్క తేలని మరో రూ.550 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. హెటిరో సంస్థ ఇతర దేశాలకు భారీగా మందులు ఎగుమతి చేస్తోంది. అమెరికా, యూరప్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు మందుల ఎగుమతి జరుగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్