Saturday, November 23, 2024
Homeసినిమాఇలాంటి హారర్ డ్రామా ఇంతవరకూ రాలేదట! 

ఇలాంటి హారర్ డ్రామా ఇంతవరకూ రాలేదట! 

ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘మసూద‘ .. ‘గాలోడు’ .. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు సినిమాల్లో ‘మసూద’ పై అందరిలో ఆసక్తి ఎక్కువగా ఉంది. అందుకు ప్రధాన కారణంగా కంటెంట్ ను గురించి చెప్పుకోవచ్చు. ఓ సాధారణమైన కుటుంబానికి చెందిన ఒక మహిళ, పెళ్లీడు కొచ్చిన తన కూతురు చిత్రంగా ప్రవర్తించడం చూసి షాక్ అవుతుంది.సింగిల్ మదర్ గా ఉన్న ఆమె, ఈ విషయంలో పక్కింటి యువకుడి సాయం తీసుకుంటుంది. కూతురు ప్రవర్తన  మానసికపరమైన జబ్బునా? లేదంటే దుష్ట శక్తుల అవాహనా? అనేది ఆమెకి అర్థం కాదు.

దాంతో ఆమె అటు హాస్పిటల్స్ కు .. ఇటు భూత వైద్యుల దగ్గరకు తన కూతురును తీసుకుని వెళుతుంది. ఆ అమ్మాయి అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? చివరికి ఏం తేలింది? అనేదే కథ. ట్రైలర్ ద్వారా ఈ కంటెంట్ ను వదిలిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరగడం మొదలైంది. ఈ సినిమాలో తల్లి పాత్రలో సంగీత .. కూతురు పాత్రలో కావ్య .. పక్కింటి యువకుడి పాత్రలో తిరువీర్ నటించారు. రాహుల్ యాదవ్ నిర్మించిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్  స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

మసూద’ అనేది ఒక ఉర్దూ పదం .. ఆ పదానికి అర్థం ‘గుడ్ ఉమెన్’  అని ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ కావ్య చెప్పింది. దాదాపు డజను సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన కావ్య, లీడ్ రోల్ చేసిన ఫస్టు మూవీ ఇదే. ఇంతకుముందు హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇలాంటి ఒక హారర్ డ్రామా ఇంతవరకూ రాలేదని కావ్య బలంగా చెబుతోంది. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందనీ, సంగీత నటన నెక్స్ట్ లెవెల్లో చూడొచ్చని ఆమె చెప్పింది. కావ్య మాటలతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ నెల 18న విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

Also Read : నవంబర్ 18న ‘మసూద’విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్