బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్వీన్ ఎలిజబెత్ (Queen Elizabeth) గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11ను సంతాప దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా సీఎస్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని సగం వరకు కిందకు దించాలని ఆదేశించారు. ఆదివారం ఎలాంటి అధికారిక వేడుకలు నిర్వహించకూడదని వెల్లడించారు.
96 ఏండ్ల క్వీన్ ఎలిజబెత్ -2 ఈనెల 8న తుది శ్వాస విడిచారు. ఆమె బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన రాణిగా నిలిచారు. బ్రిటీష్ సామ్రాజ్యం క్షీణత, సొంత కుటుంబంలో అస్తవ్యస్తతను చూసిన కల్లోల పరిస్థితులల్లో కూడా ఆమె నిబ్బరంగా ఉన్నారు. ఇది ఆమె స్థిరత్వానికి, గుండె ధైర్యానికి చిహ్నంగా నిలుస్తుంది.
Also Read : బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మృతి