Sunday, November 24, 2024
HomeTrending NewsTankBund:పర్యాటక ప్రాంతంగా ట్యాంక్ బండ్ పరిసరాలు

TankBund:పర్యాటక ప్రాంతంగా ట్యాంక్ బండ్ పరిసరాలు

ఒకప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ సమాధులు, జూపార్క్ మరి కొన్ని మాత్రమే టూరిజం ప్రాంతాలుగా ఉండేవి. ప్రస్తుతం, వీటన్నింటినీ తలదన్ని ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ మేఘా టూరిస్ట్ ప్రాంతంగా రూపొందుతోంది. ఇక్కడ కేవలం ఒక కిలోమీటర్ పరిధిలోనే దాదాపు పదహారు ప్రముఖ పర్యాటక స్థలాలున్నాయి. వీటిలో, మరో నెలరోజుల్లో బిఆర్ అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల స్మృతి కేంద్రాలు ప్రారంభం కానుండడంతో ఈ ప్రాంతమంతా పర్యాటకులతో కిటకిట లాడనుంది.
ట్యాంకుబండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లోని ప్రముఖ పర్యాటక స్థలాలు ఇవే….
1 . 125 అడుగుల అతిపెద్ద బీఆర్ అంబేద్కర్ విగ్రహం.
2 . అత్యంత విశాలమైన ఏడంతస్తుల బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం.
3 . తెలంగాణా అమరవీరుల స్మారక కేంద్రం.
4 . ట్యాంక్ బండ్ అందాలు.
5 . లుంబినీ పార్క్, బోటింగ్.
6 . హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం
7 . హుస్సేన్ సాగర్ నీటిలో కొత్తగా ఏర్పాటు చేసిన అతిపెద్ద ఫౌంటెన్.
8 . ఎన్.టి.ఆర్ గార్డెన్.
9 . ప్రసాద్ ఐమాక్స్
10 . జల్ విహార్.
11 . థ్రిల్ సిటీ.
12 . పీవీ జ్ఞాన భూమి.
13 . సంజీవయ్య పార్క్.
14 . బిర్లా టెంపుల్.
15 . బిర్లా ప్లానిటేరియం
16 . ఇందిరా పార్క్.
RELATED ARTICLES

Most Popular

న్యూస్