Union Minister Baghel To Contest Against Akhilesh Yadav :
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పై పోటీకి బిజెపి కేంద్రమంత్రిని రంగంలోకి దింపింది. మైన్ పూరి జిల్లా కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేష్ నిన్న ఉదయం నామినేషన్ దాఖలు చేయగా కమలనాథులు వ్యూహాత్మకంగా మధ్యాహ్నానానికి కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బాఘెల్ ను బరిలో నిలిపారు. ఎస్పి సింగ్ బాఘెల్ పేరు ప్రకటించటం నామినేషన్ దాఖలు చేయటం నిన్న మధ్యాహ్నం తర్వాత వేగంగా జరిగాయి.
అఖిలేష్ కుటుంబానికి పట్టున్న ప్రాంతం మైన్ పూరి జిల్లా కర్హాల్. కర్హల్ మొదటి నుంచి సమాజ్ వాది పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే బిజెపి అభ్యర్థి సత్యపాల్ సింగ్ బఘెల్ ప్రత్యర్థిగా నిలవటం, దళిత నేత కావటం కలిసి వస్తుందని కమలం నేతలు అంచనాతో ఉన్నారు. బాఘెల్ రాజకీయ జీవితం సామాజ్ వాది పార్టీతోనే ప్రారంభం అయింది. జలేసర్ నియోజవర్గం నుంచి 1998 నుంచి వరుసగా మూడుసార్లు ఎంపిగా ప్రాతినిద్యం వహించారు. ఆ తర్వాత బిఎస్పి తరపున రాజ్యసభకు వెళ్ళారు. అటు పిమ్మట బిజెపిలో చేరి యోగి మంత్రివర్గంలో యుపి మంత్రిగా పనిచేసి 2019 లో బిజెపి తరపున ఆగ్రా నుంచి గెలిచి మోడీ నేతృత్వంలో కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బాఘెల్ పోటీ చేయటం ద్వారా అఖిలేష్ కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని, పోరు ఏకపక్షంగానే సాగొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అఖిలేష్ యాదవ్ గెలుపు దాదాపు ఖయామైనట్టే. సరైన అభ్యర్థి లేకనే కమలనాథులు ఆగ్రా ఎంపి భాఘెల్ ను రంగంలోకి దింపారని భావిసిస్తున్నారు. కర్హల్ నియోజకవర్గంలో మూడో దశలో వచ్చే నెల 20 వ తేదిన పోలింగ్ ఉంది.
Also Read : అగ్రనేతల నామినేషన్లు