Tuesday, June 9, 2026
Homeసినిమా‘మధురపూడి గ్రామం అనే నేను’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

‘మధురపూడి గ్రామం అనే నేను’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Madhurapudi: శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. కళ్యాణ్‌ రామ్ క‌త్తి ఫేమ్ మల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా “మధురపూడి గ్రామం అనే నేను” సినిమాలోని ‘లింగా లింగా నీరైన గంగా..’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

శివతత్వాన్ని చెప్పే ఈ పాట ఆధ్యాత్మిక భావనతో ఆకట్టుకుంటోంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకు పరిమి కేదరనాథ్ సాహిత్యాన్ని అందించగా.. సాయికుమార్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే.. లింగా లింగా నీరైన గంగ.. గంగ తడిసిన శిలలు శివుని రూపంగా.. జన్మకో లీలలు, కర్మ పాశంగా.. ధన్యమౌ జీవులు నిన్ను తెలియంగా.. లింగా లింగా నీరైన గంగ.. గంగ తడిసిన శిలలు శివుని రూపంగా.. అంటూ సాగుతుందీ పాట. శివలీలను గుర్తుచేస్తూ రాసిన పాటగా తెలుస్తోంది. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular