How-much: నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ‘ ఫస్ట్ సింగిల్ పంచెకట్టు పాటకు అన్ని వర్గాలా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండవ సింగిల్ ”ఎంత చిత్రం” పాటని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని సర్ ప్రైజ్ చేసింది. వివేక్ సాగర్ ఈ పాట కోసం వినసొంపైన మెలోడీని కంపోజ్ చేశారు.
రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం చక్కగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. అనురాగ్ కులకర్ణి, కీర్తనా వైద్యనాథన్ ఆలాపించిన ఈ పాట మరో చార్ట్ బస్టర్ కావడం పక్కా అనిపిస్తుంది. లిరికల్ వీడియోలో నాని, నజ్రియా నజీమ్‌లా కెమిస్ట్రీ లవ్లీగా వుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.