Bharosaa: చేపల వేట నిషేద సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆడుకోవడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని వరుసగా నాలుగో ఏడాది ప్రభుత్వం నేడు అమలు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్ళే 1,08,755 మత్స్యకార కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 వేల చొప్పున దాదాపు రూ. 109 కోట్ల ఆర్ధిక సాయం, దీంతో పాటు ఓఎన్‌జీసీ సంస్ధ పైప్ లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.108 కోట్ల ఆర్ధిక సాయంతో కలిపి మొత్తం రూ. 217 కోట్లు నేడు, శుక్రవారం జూన్ 13న కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళలో సిఎం జగన్ అందజేయనున్నారు.
నేడు అందిస్తోన్న ఆర్ధికసాయంతో కలిపి ఇప్పటివరకు మత్స్యకార భరోసా పథకం క్రింద మాత్రమే అందించిన మొత్తం సాయం రూ. 418 కోట్ల రూపాయలు. మర, యాంత్రిక పడవలతో పాటు సాంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలకు కూడా ఈ సాయం అందిస్తోంది.
గతంలో డీజిల్ ఆయిల్‌పై సబ్సిడీ లీటర్‌కు రూ. 6.03 ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రూ. 9 కి పెంచడమే కాక స్మార్ట్ కార్డులు జారీ చేసి డీజిల్ పోయించుకునేటప్పుడే సబ్సిడీ లబ్ధి వారికి అందేలా ఏర్పాటు చేసింది. వేట చేస్తూ మరణించిన మత్స్యకార కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 3,606 కోట్ల వ్యయంతో 9 ఫిషింగ్ హర్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది
ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు ఐ పోలవరం మండలం కొమరగిరి చేరుకుంటారు. 10.45 గంటలకు మురమళ్ళ వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు, అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు మురమళ్ళ నుంచి బయలుదేరి 1.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Also Read : బయో ఇథనాల్ ప్లాంట్ కు ఎస్‌ఐపీబీ ఆమోదం