కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో దేశంలో అరచకాన్ని సృష్టిస్తున్నదని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర సర్కార్ ఫెడరల్ వ్యవస్థ కి తూట్లు పొడుస్తున్నదన్నారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి FRBM ద్వారా తెలంగాణకు రావాల్సిన అప్పుల విషయంలో కూడా కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లకు అడ్డుపడుతున్నదని, ఉపాధి హామీ పథకం అమలు విషయంలో తెలంగాణ రాష్ట్రంపై కేంద్రము వివక్ష చూపెడుతున్నదన్నారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకం భేషుగ్గా అమలు అవుతున్నదని అధికారులు తేల్చారు.కానీ కేంద్రం కావాలని కొర్రీలు పెట్టి ఉపాధి హామీ పథకం విషయంలో ఇబ్బందులు పెడుతుందన్నారు.
తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని బంద్ పెట్టాలని కేంద్రం కుట్ర చేస్తున్నదని గుత్తా ఆరోపించారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి నిత్యావసర సరుకులపై GST విధించి పైశాచికంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అన్ని వస్తువులపైన GST పెంచి ప్రజలపై కేంద్రం భారం మోపిందన్నారు. చివరికి స్మశాన వాటికలను కూడా GST పరిధిలోకి తేవడం దుర్మారమని, మోడీ ప్రభుత్వంలో ప్రజలు బ్రతికేలా లేరు. ప్రజలను పిక్కుతింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వంద లక్షల కోట్లు అప్పులు చేసింది మోడీ ప్రభుత్వమని, ఇది కేంద్రంలోని బిజెపి సర్కార్ ఘనకార్యమని సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ED, CBIలను ఉసిగొల్పి మాట వినని ప్రభుత్వలను బ్లాక్ మెయిల్ చేయడమే కేంద్రం పని అన్నారు. శివసేన పార్టీని నిర్వీర్యం చేసి ఫెడరల్ వ్యవస్థకు బిజెపి విఘాతం కలిగిస్తుందని విమర్శించారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. దేశాన్ని తమ కబంధ హస్తాల్లోకి తెచ్చుకునేల మోడీ పన్నాగం పన్నుతున్నాడని, ప్రజల గురించిన ఆలోచన లేనే లేదన్నారు. బీజేపీతో దేశం ప్రమాదంలో పడిందని, దక్షిణ భారత దేశం నుంచి గతంలో ఉపరాష్ట్రపతి పదవికి అవకాశం ఉండేదని ఇప్పుడు ఆ పదవి కూడా ఇవ్వకుండా బిజెపి పార్టీ అన్యాయం చేస్తుందని విమర్శించారు.
Also Read : కులాల పేరుతో రాజకీయాలు గుత్తా ఆవేదన