Wednesday, June 10, 2026
HomeTrending Newsవెసెక్టమీలో తెలంగాణ రెండో స్థానం

వెసెక్టమీలో తెలంగాణ రెండో స్థానం

పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వెసెక్టమీ సర్జరీలు జరిగాయి. దీంతోపాటు వ్యక్తిగత జాబితాలో అత్యధిక సర్జరీలు చేసినందుకు హన్మకొండ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాకూబ్‌పాషాకు కేంద్రం ప్రత్యేక అవార్డు ప్రకటించింది. ఆయన తన 22 ఏళ్ల సర్వీసులో 40వేలకు పైగా సర్జరీలు నిర్వహించారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ‘నేషనల్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ సమ్మిట్‌-2022’లో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ చేతులమీదుగా రాష్ట్ర అధికారులు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బందిని, హన్మకొండ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాకూబ్‌పాషాను ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular