ఫాంహౌజ్ కేసులో నిందితులను హైకోర్టు రిమాండ్ కు అంగీకరించింది. కోర్టు రిమాండ్ కు అంగీకరించడంతో నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్ పేట్ లోని తన నివాసం నుంచి తరలించారు. ఇంటి వెనుక గేట్ నుంచి నిందితులను తరలించారు. మీడియా కంట పడకుండా నందకుమార్ తో పాటు మిగతా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మొదట ఏసీబీ ప్రొసీజర్ ఫాలో అవలేదని చెప్పి.. రిమాండ్ తిరస్కరించగా.. ఏజీ వెంటనే రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో నిందితుల అరెస్ట్ కు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. రెండు రోజల క్రితం నాంపల్లి ఏసీబీ కోర్టు మేజిస్ట్రేట్ నిందితులకు రిమాండ్ నిరాకరిస్తూ ఇచ్చిన ఆర్డర్ ను హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం చేసిన అప్పీల్ ను పరిగణలోకి తీసుకున్నది. నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు హాజరు పరచనున్నారు.