Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్IPL: పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు: ఢిల్లీ చేతిలో ఓటమి

IPL: పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు: ఢిల్లీ చేతిలో ఓటమి

పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలపై ఢిల్లీ నీళ్ళు చల్లింది. నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగులతో విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన  ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 2 వికెట్లకు  213 పరుగులు చేయగా లక్ష్య సాధనలో పంజాబ్ 8వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేయగలిగింది.

ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా-వార్నర్ లు తొలి వికెట్ కు 94 పరుగులు జోడించారు. వార్నర్  31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46; షా 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో  54 పరుగులు చేసి ఔటయ్యారు. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రీలీ రోస్సో ఈ మ్యాచ్ లో చెలరేగి ఆడి 37 బంతుల్లో 6 ఫోర్లు,  6 సిక్సర్లతో  82 పరుగులతో అజేయంగా నిలవగా… ఫిల్ సాల్ట్ సైతం 14బంతుల్లో  2ఫోర్లు,  2 సిక్సర్లతో 26పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. పంజాబ్ బౌలర్ శామ్ కర్రన్ కే రెండు వికెట్లూ దక్కాయి.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ స్కోరు బోర్డు తెరవక ముందే ఓపెనర్, కెప్టెన్ ధావన్ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ సిమ్రాన్ సింగ్ కూడా 22 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో అథర్వ తైడే- లియామ్ లివింగ్ స్టోన్ లు మూడో వికెట్ కు 78పరుగులు జోడించారు. తైడే 42 5 2 55 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. జితేష్ శర్మ(డకౌట్), షారుఖ్ ఖాన్(6), కర్రన్ (11), హర్ ప్రీత్ బ్రార్ (డకౌట్) లు విఫలమయ్యారు. సహచరులు వెనుదిరుగుతున్నా లివింగ్ స్టోన్ ఒంటరి పోరాటం చేశాడు. 48 బంతుల్లో 5 ఫోర్లు,  9  సిక్సర్లతో 94 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు.

ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, నార్త్జ్ చెరో రెండు; ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.

రోస్సోకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్