Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Weekly Horoscope in Telugu :

మేషం (Aries):
మిశ్రమ ఫలితాలుంటాయి. పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. అవసరాలకు సరిపడినంత డబ్బు సమకూరుతుంది. ఖర్చులు అదుపు చేయాలి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం ఉంది. వారం మధ్యలో అనుకోని అదృష్టం వరిస్తుంది. విందులో పాల్గొంటారు. అన్ని రంగాలవారికీ అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అనుకోని అపనిందలు వస్తాయి. కుటుంబంలో కూడా చికాకులు ఉంటాయి. ఆస్తి క్రయ విక్రయ ప్రయత్నాలు అనుకూలించవు. తగాదాలు, మానసిక అశాంతి కలిగే సూచనలున్నాయి. మేలిమి ఫలితాలకు శివపార్వతులను పూజించండి.

వృషభం (Taurus):
మేలిమి కాలం నడుస్తోంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ధనలాభం ఉంది. అభీష్టాలు నెరవేరతాయి. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. వాహన యోగం ఉంది. అప్పులు చెల్లించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శారీరక సుఖాలకు లోటుండదు. వారం మధ్యలో ఖర్చులు అదుపు తప్పడం ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. మరిన్ని శుభ ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరుని పూజించండి.

మిథునం (Gemini):
పరిస్థితులు మెరుగవుతాయి. అభీష్టాలు నెరవేర్చుకుంటారు. పనుల పూర్తికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. మంచి అవకాశాలు చేజారే వీలుంది. జాగ్రత్తగా ఉండండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. సంతాన సంబంధ విషయంలో మనోవాంఛ నెరవేరుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు. శారీరక, మానసిక సుఖం లభిస్తుంది. వారం చివర్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా పరుల విషయాల్లో తలదూర్చకండి. మేలిమి ఫలితాలకు సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

Weekly Horoscope in Telugu :

కర్కాటకం (Cancer):
అనుకూల ఫలితాలే అధికంగా ఉన్నాయి. పనులు విజయవంతం అవుతాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. పోటీల్లో మీదే గెలుపు. పెద్దలు, అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ మార్పు సత్ఫలితాలనిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అప్పులు చెల్లించే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. సంతాన సంబంధ వ్యవహారాలు విచారాన్ని కలిగిస్తాయి. మేలిమి ఫలితాలకు శ్రీనృసింహ స్వామిని పూజించండి.

సింహం (Leo):
అప్రమత్తంగా ఉండండి. పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఖర్చులు ఎక్కువవుతాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. అనుకున్నట్లుగా సౌకర్యాలు సమకూర్చుకోలేరు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. చెడుదారుల్లో వెళతారు. అనవసర తగాదాలు వస్తాయి. భవిష్యత్ కోసం ప్రణాళికలు రూపొందించుకుంటారు. వారం చివర్లో పరిస్థితి అనుకూలిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కార్యాలు సాధించుకుంటారు. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మేలిమి ఫలితాలకు నవగ్రహాలను పూజించండి.

కన్య (Virgo):
ముఖ్యమైన పనులను వారం మొదట్లోనే ప్రారంభించండి. ప్రతిపనికీ ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఇతరులతో తగాదాలు గోచరిస్తున్నాయి. వేళకు భోజనం ఉండదు. జీర్ణ సంబంధ సమస్యలు చికాకు పెడతాయి. వివిధ వృత్తుల్లో కొనసాగేవారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతానంతో విరోధం ఏర్పడుతుంది. మానసిక శాంతి కరువవుతుంది. బంధువులను కలుసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ చికాకులను అధిగమిస్తారు. శుభ ఫలితాల కోసం ఈరాశివారు సాయిబాబాను పూజించడం మంచిది.

తుల (Libra):
మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. ఖర్చులు ఎక్కువ కావడంతో అప్పులు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. విందుల్లో పాల్గొంటారు. వారం చివర్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. నిర్దేశించుకున్న పనులు పూర్తికాకపోవడం అసహనాన్ని పెంచుతుంది. బుద్ధి నిలకడ లేక తగాదాలకు దిగే వీలుంది. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. శారీరక, మానసిక శాంతి దూరమవుతుంది. శుభఫలితాలకు గణపతిని దర్శించి, పూజించండి.

Weekly Horoscope in Telugu :

వృశ్చికం (Scorpio):
పనులు విజయవంతం అవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. బంధుమిత్రులను కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల సహాయ సహకారాలతో శుభ ఫలితాలు పొందుతారు. కొత్త వస్తువులను కొంటారు. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబంలోని చికాకులను తొలగించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బద్దకం వదిలిపెట్టండి. నీచమైన ఆలోచనలు మంచిది కాదు. ముఖ్యమైన వస్తువు లేదా డాక్యుమెంట్ కనిపించకుండా పోతుంది. వారం మొదట్లో ఖర్చులు అదుపు చేయండి. మేలిమి ఫలితాలకు నవగ్రహాలను పూజించండి.

ధనస్సు (Sagittarius):
మిశ్రమ ఫలితాలున్నాయి. కార్యజయం కోసం బాగా శ్రమించాలి. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. రియల్ ఎస్టేల్, విద్యారంగంలోని వారికి అనుకూలంగా లేదు. నష్టాలు, అవమానాలు గోచరిస్తున్నాయి. మీ తెలివితేటలకు గుర్తింపు లభించదు. శారీరక, మానసిక అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సంతాన సంబంధ వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. శతృవులు పెరుగుతారు. వారం చివర్లో మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అనూహ్య ధనలాభం ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభ ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.

మకరం (Capricorn):
మిశ్రమ ఫలితాలుంటాయి. కీలకమైన పనులను వారం ప్రారంభంలోనే మొదలు పెట్టండి. విజయం సిద్ధిస్తుంది. ధనాదాయం కూడా మెరుగవుతుంది. తప్పుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టాలకు గురి చేస్తుంది. ముఖ్యంగా స్థిరాస్తి, విద్యారంగాల్లోని వారికి ధననష్టం గోచరిస్తోంది. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. సంతాన సంబంధ వ్యవహారాలు ఆవేదనను కలిగిస్తాయి. మీ తెలివితేటలకు గుర్తింపు లభించదు. ఆత్మీయులను కలుసుకుంటారు. దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి. ఆస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోండి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. మేలిమి ఫలితాల కోసం సాయిబాబాను దర్శించండి.

కుంభం (Aquarius):
మిశ్రమ ఫలితాలుంటాయి. అభీష్టాలు నెరవేర్చుకునేందుకు అమితంగా శ్రమించాల్సి ఉంటుంది. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. ఆత్మవిశ్వాసం వదలకండి. మిత్రులు, సోదరులు తోడుగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. మానసిక శాంతి లోపిస్తుంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. అవమానాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉండదు. ఆస్తి క్రయవిక్రయాలకు అనువైన కాలం కాదు. నూతన విజ్ఞాన సముపార్జనకూ ఆటంకాలు ఏర్పడతాయి. బుద్ధి నిలకడగా ఉండదు. ఆత్మవిశ్వాసం కోల్పోకండి. మేలిమి ఫలితాల కోసం దుర్గాదేవిని ప్రార్థించండి.

మీనం (Pisces):
అదృష్టవంతమైన కాలం. అభీష్టాలు నెరవేరతాయి. ప్రారంభించిన పనులన్నింటా విజయం చేకూరుతుంది. విశేష ధనలాభం ఉంది. దానికి తగ్గట్లే ఖర్చులూ ఉంటాయి. వాహన అనుభవం ఉంది. దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. విందులో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. శారీరక, మానసిక సౌఖ్యాలు పొందుతారు. సోదరవర్గం మీకు తోడుగా ఉంటుంది. ప్రియతములతో సంభాషణలు ఉల్లాసాన్నిస్తాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యే అకాల విరోధం గోచరిస్తోంది. ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. మేలిమి ఫలితాలకు శనికి తైలాభిషేకం చేయండి.

గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com