Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Weekly Horoscope in Telugu :

మేషం (Aries):
శుభఫలితాలుంటాయి. తలచిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. వస్తువాహనాది సౌకర్యాలను సమకూర్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. వారం చివర్లో తగాదాలు, పెద్దల ఆగ్రహానికి గురికావడం గోచరిస్తున్నాయి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబంలో సుశఖాంతులుంటాయి. సంతానాభిలాషులకు శుభకాలం. సంతానం వృద్ధిలోకి వస్తుంది. విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరుస్తారు. నిరుద్యోగుల కలలు నెరవేరతాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారు అద్భుతంగా రాణించి, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపార రంగంలోని వారు శత్రువులపై విజయం సాధిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి ఆర్థిక నష్టాలు, అవమానాలు సూచిస్తున్నాయి. ఈరాశి వారు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మెరుగైన ఫలితాలుంటాయి.

వృషభం (Taurus):
శుభ ఫలితాలుంటాయి. ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. ఇంటికి దూరంగా ఉన్నవాళ్లు స్వస్థలాలకు చేరుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విజ్ఞానం, కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల కోసం చేసే ప్రయాణాలు లాభదాయకమవుతాయి. వాహనం కొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. సంసార సుఖానికి లోపముండదు. సంతానం మూలకంగా వేదన ఉంటుంది. విద్యార్థులకు అయినవారితోనూ దూషణలు తప్పవు. నిరుద్యోగులకు నిరాశ, వృత్తి ఉద్యోగాల్లోని వారికి అధికారులతో ఘర్షణ వైఖరి వల్ల ఇబ్బందులు తప్పవు. వ్యాపార రంగంలోని వారు తప్పుడు మార్గాలు అనుసరించడం వల్ల ప్రతిష్టను కోల్పోతారు. వ్యాపార రంగంలోని వారికి ఫలితాలు అందకుండా ఊరిస్తాయి. మేలిమి ఫలితాల కోసం పార్వతీదేవిని ఆరాధించండి.

మిథునం (Gemini):
ప్రతికూల కాలం నడుస్తోంది. ప్రతిపనిలో అడ్డంకులు ఎదురవుతాయి. డబ్బుకి బాగా ఇబ్బందిగా ఉంటుంది. వృథా ఖర్చులు మీదపడడం ఆందోళనను కలిగిస్తుంది. మీ తెలివితేటలు ఏవీ పనిచేయవు. నీచపు ఆలోచనలు, లేనిపోని అనుమానాలు వదిలేయండి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. విలువైన వస్తువు దొంగతనం కావచ్చు. రుణదాతల ఒత్తిళ్లు పెరుగుతాయి. శత్రువుల కుట్రలకు బలవుతారు. జీవిత భాగస్వామి తోడ్పాటు మనోబలాన్నిస్తుంది. సంతానం వృద్ధిలోకి రావడం ఆనందాన్నిస్తుంది. విద్యార్థులు స్వయంప్రతిభతో గుర్తింపును తెచ్చుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి దూరప్రాంతాలకు బదిలీలు, మనోవ్యధ గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారికి ధనలాభం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి భాగస్వాములతో సఖ్యత చెడుతుంది. మేలిమి ఫలితాల కోసం నవగ్రహాలను పూచించండి.

Weekly Horoscope in Telugu :

కర్కాటకం (Cancer):
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తలపెట్టిన పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. అవసరాలకు సరిపడినంత డబ్బు అందదు. ఖర్చులు పెరుగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభించదు. బంధువులతో వాగ్వాదాలు అవమానకరంగా ఉంటాయి. వాహనం, ఆస్తి అమ్మే ప్రయత్నాలు అనుకూలించవు. ఒత్తిళ్లు మానసిక అశాంతిని పెంచుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుడుగు వేయండి. జీవితభాగస్వామి ధిక్కార వైఖరి ఆందోళన కలిగిస్తుంది. సంతానానికి ఇబ్బందికరమైన కాలం. విద్యార్థుల శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు. నిరుద్యోగులకు ఉత్సాహభంగం, వృత్తి ఉద్యోగాల్లోని వారికి సహచరులతో వివాదాలు చేటుని తెస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ప్రతి పనికీ అడ్డంకులు ఎదురవుతాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి రుణాలు, లిటిగేషన్ల నుంచి స్వల్ప ఊరట లభిస్తుంది. గౌరీదేవిని పూజించడం వల్ల మేలిమి ఫలితాలుంటాయి.

సింహం (Leo):
కాలం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న పనులేవీ జరగవు. ఖర్చులు మితిమీరతాయి. ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఆస్తిని తక్కువ ధరకే అమ్మాల్సి రావచ్చు. అకారణంగా విరోధాలు తలెత్తుతాయి. బంధువులు దూరమవుతారు. మిత్రుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు లాభించవు. జీర్ణ సంబంధ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎవరికైనాసరే హామీలు ఉండకండి. కుటుంబ సౌఖ్యం, సంతానప్రాప్తి ఉంది. సంతానం వృద్ధికి చేసే ప్రయత్నాలకు అటంకాలుంటాయి. విద్యార్థులకు శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. నిరుద్యోగులకు యోగకాలం. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ఉన్నతాధికారుల ఆదరణ పొందుతారు. వ్యాపార రంగంలోని వారికి అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి పోటీదారుల బాధలు ఎక్కువవుతాయి. మరిన్ని మేలిమి ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కన్య (Virgo):
మిశ్రమ ఫలితాలుంటాయి. తలపెట్టిన పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులూ విపరీతరంగా ఉంటాయి. బంధుమిత్రులతో అకారణ విరోధాలు చికాకును కలిగిస్తాయి. మాట చెల్లుబాటు కాక ఉత్సాహం సన్నగిల్లుతుంది. వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతుంది. కంటి సంబంధ సమస్యలుంటాయి. మనోధైర్యంతో ముందుకు సాగితే అదృష్టం తోడవుతుంది. జీవితభాగస్వామితో ఉల్లాసంగా గడుపుతారు. సంతానంతో విభేదాలొస్తాయి. విద్యార్థులు ప్రతికూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు నిరాశ, వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఉన్నతాధికారులతో మాటలు, మనస్తాపం సూచిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారు ఐశ్వర్యం నష్టపోతారు. గోచరిస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారు, పోటీదారుల కుట్రలు, కుతంత్రాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరిన్ని మేలిమి ఫలితాల కోసం శివారాధన చేయండి.

తుల (Libra):
గతం వారం కన్నా కాస్త మెరుగైన ఫలితాలుంటాయి. విపరీతంగా శ్రమిస్తేనే పనులు పూర్తవుతాయి. డబ్బు సంపాదన మెరుగ్గా ఉంటుంది. ఖర్చులూ పెరుగుతాయి. ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. అశాంతి, నిద్రలేమి ఇబ్బంది పెడతాయి. సహాయం చేస్తానన్నవారు ముఖం చాటేస్తారు. వారం చివర్లో సోదర వర్గం తోడ్పాటుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. జీవిత భాగస్వామి చేదోడువాదోడుగా ఉంటారు. సంతానం వృద్ధికి అవరోధాలు ఎదురవుతాయి. విద్యార్థులు విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపార రంగంలోని వారికి ఆశించిన మేర లాభాలుండవు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందుతారు. శనైశ్చరుడికి తైలాభిషేకం చేయడం వల్ల మేలిమి ఫలితాలుంటాయి.

Weekly Horoscope in Telugu :

వృశ్చికం (Scorpio):
మేలిమి ఫలితాలుంటాయి. పనులు సఫలమవుతాయి. ధనలాభం ఉంది. జీవితం పురోభివృద్ధిలో సాగుతుంది. కావలసని సౌకర్యాలను సమకూర్చుకుంటారు. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారం మధ్యలో కాస్త ఇబ్బందికర పరిస్థితులున్నా, తెలివితేటలతో అధిగమిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సంతాన సంబంధ వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. విద్యార్థుల కష్టం ఫలించదు. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి.వృత్తి ఉద్యోగాల్లోని వారికి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న శుభసమాచారం అందుతుంది. వ్యాపార రంగంలోని వారు అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచనలున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి అన్నింటా గొడవలతో మనశ్శాంతి కరువవుతుంది. సాయిబాబాను పూజిస్తే మరిన్ని మేలిమి ఫలితాలు ఉంటాయి.

ధనస్సు (Sagittarius):
మిశ్రమ ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో ఒడుదుడుకులున్నా, క్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆత్మవిశ్వాసం, స్థిరచిత్తంతో పనుల్లో విజయం సాధిస్తారు. ఖర్చులకు సరిపడా ఆదాయం ఉంటుంది. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆదరణను పొందుతారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. వారం చివర్లో ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉండదు. జీవితభాగస్వామి తోడ్పాటు కుటుంబంలో శాంతిని నింపుతుంది. సంతాన మూలకంగా ఆనందం వృద్ధి చెందుతుంది. విద్యార్థులు చదువులో ప్రతిభను కనబరిచి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు మనస్తాపం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారు నమ్మినవారి చేతుల్లో మోసపోతారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి లిటిగేషన్‌ వ్యవహారాలు మానసిక వ్యధను మిగులుస్తాయి. శివారాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn):
యోగదాయకంగా ఉంది. అభీష్టాలు నెరవేరతాయి. పనులన్నింట్లోనూ విజయం సిద్ధిస్తుంది. డబ్బుఇబ్బందులు తొలగుతాయి. అప్పులు చెల్లించి కొంత మొత్తం నిల్వ చేసుకోగలుగుతారు. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ విరోధులపై విజయం సాధిస్తారు. అధికారులు, పెద్దల ఆదరాభిమానాలు పొందుతారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. శారీరక, సాంసారిక సుఖాలకు కొదవ ఉండదు. సంతానం వృద్ధికి ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన గుర్తింపు ఉండదు. నిరుద్యోగులకు ప్రతికూల ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ఇష్టంలేని బదిలీలు సూచిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారికి నష్టదాయకంగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి చెడుసావాసాల వల్ల చేటు కలుగుతుంది. సాయిబాబా దర్శనం మరింత మేలు చేస్తుంది.

కుంభం (Aquarius):
వారం ప్రారంభంలో ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనులు పూర్తి కావు. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. రోజులు గడిచేకొద్దీ పరిస్థితులు మీ అదుపులోకి వస్తాయి. అభీష్టాలు నెరవేరతాయి. పనులన్నీ విజయవంతం అవుతాయి. పెద్దల ఆదరాభిమానాలు తోడవుతాయి. రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. సుఖసంతోషాలతో కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సంతాన సంబంధంగా విపరీతమైన ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి స్థానచలనం గోచరిస్తోంది. వ్యాపార రంగంలోని వారు ఇతరుల తప్పిదాలకు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి ఆర్థిక వ్యవహారాలు కుదుటపడతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces):
మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. సంపాదన పెరుగుతుంది. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వారం మధ్యలో ప్రతికూలతలుంటాయి. పనుల్లో జాప్యం, అనుకోని ఖర్చులు చికాకు కలిగిస్తాయి. తగాదాల వల్ల కష్టాలు పెరుగుతాయి. కోపగుణం వల్ల పెద్దల ఆదరణను కోల్పోతారు. కుటుంబ సౌఖ్యానికి దూరమవుతారు. సంతాన సంబంధ పనులు మందగిస్తాయి. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ధనాదాయంలో లోపం ఉండదు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి అవరోధాలు ఎక్కువవుతాయి. దత్తాత్రేయుణ్ణి ధ్యానిస్తే మేలిమి ఫలితాలు కలుగుతాయి.

గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

1 thought on “వారఫలం (23-01-2022 నుంచి 29-01-2022 వరకు)

  1. వార ఫలాల ఈ-సంచిక ద్వారా మంచి సమాచారం అందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదములు మరియు అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com