Weekly Horoscope in Telugu :
మేషం (Aries):
శుభఫలితాలుంటాయి. చేపట్టిన పనులన్నింటా విజయం లభిస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ధనలాభం గోచరిస్తోంది. వాహన యోగం ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవర్తమానం అందుతుంది. వివిధ రంగాల్లోని వారందరికీ అదృష్టం వరిస్తుంది. ఆత్మవిశ్వసంతో అన్ని కార్యాలు నెరవేర్చుకుంటారు. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చకండి. ఎవరికీ పూచీ ఉండకండి. ఆత్మీయులతో సంభాషణలు ఆనందాన్నిస్తాయి.
వృషభం (Taurus):
మిశ్రమ ఫలితాలుంటాయి. కొద్దిపాటి కష్టంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్త స్నేహాలు ఉపకరిస్తాయి. ఇష్టమైన వారితో విందుల్లో పాల్గొంటారు. కొత్త విజ్ఞానాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి యోగదాయకంగా ఉంటుంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణ యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధననష్టం గోచరిస్తోంది. ఇతరులతో వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు లాభించవు. బంధువులతో విరోధం ఏర్పడే వీలుంది. బద్దకం వదలకుంటే ఆపదల్లో పడతారు.
మిథునం (Gemini):
గోచార స్థితి బాగుంది. సుఖసంతోషాలతో కాలం గడుస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. వృత్తుల్లో రాణిస్తారు. పెద్దలు, అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన సౌకర్యాలను సమకూర్చుకుంటారు. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. వారం చివర్లో మానసికమైన దిగులు ఆవరించే వీలుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
Weekly Horoscope in Telugu :
కర్కాటకం (Cancer):
యోగదాయకంగా ఉంటుంది. ప్రయత్నించిన ప్రతి పనీ సఫలం అవుతుంది. ఆటంకాలను దిగ్విజయంగా దాటేస్తారు. పైవారి అండదండలతో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈక్రమంలో కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లోనూ సఖ్యత ఏర్పడుతుంది. చక్కటి భవిష్యత్ కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. సంతాన సంబంధ అంశాలు తృప్తినిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అనవసర వ్యవహారాల జోలికి వెళ్లకండి. ఆరోగ్యం జాగ్రత్త.
సింహం (Leo):
మేలిమి ఫలితాలు లభిస్తాయి. చేస్తున్న పనులు విజయవంతం అవుతాయి. అభీష్టాలు నెరవేరతాయి. ధనలాభం ఉంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. సంతానంతో విరోధం గోచరిస్తోంది.. సంయమనంగా ఉండండి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవకాశాలను వినియోగించుకుంటారు. గౌరవం పెరుగుతుంది. అధికారవర్గం అండదండలు లభిస్తాయి. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఖర్చులు అదుపు చేయాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కన్య (Virgo):
పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఆటంకాలు ఎక్కువవుతాయి. అశాంతి పెరుగుతుంది. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. పెద్దలు, అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోతారు. పొట్టకు సంబంధించిన సమస్యలుంటాయి. వారాంతానికి ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఆత్మ స్థైర్యం కోల్పోకండి. వృత్తిపర విజయాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
తుల (Libra):
మిశ్రమ ఫలితాలుంటాయి. చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో కార్యాలు సాధించుకుంటారు. వస్తు, వాహన సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యలు అధిగమిస్తారు. ప్రయాణాలు, భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. పుణ్య, శుభ కార్యాల్లో పాల్గొంటారు. వారాంతంలో మీ శత్రువులు విజృంభిస్తారు. స్వల్ప తగాదాలు వస్తాయి. పైత్య, కీళ్ల సంబంధ సమస్యలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.
Weekly Horoscope in Telugu :
వృశ్చికం (Scorpio):
పనులు విజయవంతం అవుతాయి. పూర్వ వైభవాన్ని పొందుతారు. ధనసంబంధ ఇబ్బందులు తగ్గుతాయి. ఇంటికి, అయినవారికి చేరువవుతారు. మీ తెలివితేటలకు తగినంత గుర్తింపు లేదన్న బాధ ఉన్నా, బంధు మిత్రుల సహకారంతో అభీష్టాలు నెరవేర్చుకుంటారు. కొత్త వస్తువులు కొంటారు. విందుల్లో పాల్గొంటారు. ఇతరులు, కొత్తవారితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. నూతన విజ్ఞానాన్ని పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. వారాంతంలో పొదుపును పాటించండి. మాట తూలకండి.
ధనస్సు (Sagittarius):
మిశ్రమ ఫలితాలుంటాయి. ఆటంకాలు ఎదురైనా అభీష్టాలను నెరవేర్చుకుంటారు. ప్రారంభంలో ఒడుదుడుకులున్నా వారం చివరికి శుభఫలితాలు అందుతాయి. శత్రుపీడ కారణంగా దుఃఖం కలుగుతుంది. మీ తెలివితేటలకు గుర్తింపు ఉండదు. ఖర్చులూ అదుపు తప్పుతాయి. తొందరపాటు వల్ల ధనాన్ని నష్టపోయే సూచనలున్నాయి. బద్ధకాన్ని వదలి, ఆత్మవిశ్వాసంతో కృషి చేయండి. పూర్వవైభవం పొందుతారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పుణ్య, శుభ కార్యాల్లో పాల్గొంటారు.
మకరం (Capricorn):
మిశ్రమ ఫలితాలుంటాయి. అభీష్టాలు నెరవేరే క్రమంలో ఆటంకాలు తప్పవు. శత్రువులపై విజయం సాధిస్తారు. డబ్బుకి స్వల్ప ఇబ్బంది ఉంటుంది. నిలకడలేమి వల్ల పనులు నాశనం అయ్యే సూచనలు ఉన్నాయి. వృథా ఖర్చులు ఆందోళనను కలిగిస్తాయి. అనవసర జోక్యాల వల్ల అవమానాలు తప్పవు. విలువైన వస్తువు దొంగతనానికి గురి కావచ్చు. వారం చివరినాటికి పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల సహకారంతో ఇబ్బందులు తొలగించుకుంటారు. కొత్త వస్తువులు కొంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.
కుంభం (Aquarius):
తలపెట్టిన పనులు పూర్తి అవుతాయి. ఆటంకాలు ఎదురైనా కార్యాలు సాధించుకుంటారు. ధనాదాయ వృద్ధి ఉంది. నూతన వస్తువులు, ఆభరణాలు కొంటారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. మిత్రులు సర్వదా తోడుగా నిలుస్తారు. ఆత్మీయులతో సంభాషణలు ఆనందాన్నిస్తాయి. వారం ద్వితీయార్థంలో మనసు నిలకడగా ఉండదు. ఖర్చులూ అదుపు తప్పుతాయి. అవమానాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు వస్తాయి. సంతాన సంబంధ విషయాలు ఆందోళన కలిగిస్తాయి. ఆస్తుల విక్రయ ప్రయత్నాలు ఫలించవు.
మీనం (Pisces):
అభీష్టాలు నెరవేర్చుకునే క్రమంలో అడ్డంకులు ఎదురవుతాయి. అంతిమ విజయం మీదే. ఆత్మవిశ్వాసంతో కార్యాలు సాధించుకుంటారు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. అవసరమైన వస్తువులు కొంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. మిత్రులు తోడుగా నిలుస్తారు. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. ఇతరుల వల్ల ఇబ్బందులు, అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో కూడా చికాకులుంటాయి. అవమానాలు ఎదురవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం జాగ్రత్త.
గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.
శుభం భూయాత్
పి.విజయకుమార్
[email protected]