Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Weekly Horoscope in Telugu :

మేషం (Aries):
గ్రహస్థితి శుభప్రదంగా ఉంది. సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు. అవసరానికి తగిన డబ్బు సమకూరుతుంది. ఇతరుల తోడ్పాటు లభిస్తుంది. నూనత సౌకర్యాలను సమకూర్చుకుంటారు. వాహన యోగం ఉంది. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. శారీరక మానసిక ఆనందం లభిస్తుంది. అన్నింటా అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి. మిత్రులతో వైరం మంచిది కాదు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉత్సాహకరమైన మానసిక స్థితి ఉంటుంది. మరిన్ని మేలిమి ఫలితాలకు పార్వతీదేవిని పూజించండి.

వృషభం (Taurus):
యోగదాయకమైన కాలం. అభీష్టాలు నెరవేరతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. జీవితంలో పురోభివృద్ధి ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు, చిత్తశుద్ధితో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన విద్యాప్రయత్నాలు సఫలమవుతాయి. సంతాన సంబంధ విషయాల్లో విపరీతమైన ఆనందం కలుగుతుంది. వారం చివర్లో అప్రమత్తంగా ఉండండి. మరిన్ని మేలిమి ఫలితాల కోసం గణపతిని పూజించండి.

మిథునం (Gemini):
అభీష్టం నెరవేరుతుంది. పట్టింది బంగారంలా సాగుతుంది. డబ్బుకి లోటుండదు. పెద్దల ఆదరాభిమానాలు లభిస్తాయి. ఉద్యోగులు, అధికారుల అండదండలతో ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ప్రతి సందర్భంలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అత్యవసర సమయాల్లో ఆత్మీయులు అండగా నిలుస్తారు. కోరుకున్న సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఇంట్లో సుహృద్భావ వాతావరణం ఉంటుంది. అప్పులు చెల్లించేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారం మొదట్లో తొందరపాటు వద్దు. మరిన్ని మేలిమి ఫలితాలకు మంగళగౌరిని పూజించండి.

Weekly Horoscope in Telugu :

కర్కాటకం (Cancer):
ముఖ్యమైన పనులను వారం మొదట్లో ప్రారంభించకండి. అన్నింటా అడ్డంకులే ఎదురవుతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపాటి తగాదాలు గోచరిస్తున్నాయి. అధికార వర్గం లేదా కుటుంబ పెద్దల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంది. అనుకున్న సౌకర్యాలను సమకూర్చుకోలేరు. సంతానం చర్యలు ఆందోళన కలిగిస్తాయి. శత్రువులు వృద్ధి చెందుతారు. అయితే వారం ద్వితీయార్థంలో పరిస్థితులు చక్కబడతాయి. అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త బరువు బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మేలిమి ఫలితాల కోసం సాయిబాబాను పూజించండి.

సింహం (Leo):
ముఖ్యమైన కార్యాలను వారం ప్రారంభంలోనే ముగించండి. అవసరానికి తగిన డబ్బు సమకూరుతుంది. అయితే మితిమీరిన ఖర్చుల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వారం ద్వితీయార్థంలో ప్రతి సందర్భంలోనూ జాగ్రత్తగా ఉండండి. బయటి వారి వల్ల ఇబ్బందులొస్తాయి. అనవసర నిందలు భరించాల్సి వస్తుంది. ఇంటికి దూరంగా గడపాల్సి రావచ్చు. ఉదర సంబంధ సమస్యలు చికాకు పెట్టొచ్చు. ప్రయాణాల్లో, ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. త్వరగా అలసిపోతారు. మానసిక శాంతి దూరమవుతంది. శుభఫలితాలకు శ్రీవేంకటేశ్వరుని పూజించండి.

కన్య (Virgo):
వారం మొదట్లో ప్రతిపనీ విజయవంతం అవుతుంది. కొద్దిపాటి డబ్బు చేతికి అందుతుంది. బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. వారం ద్వితీయార్థంలో అప్రమత్తంగా ఉండండి. ఏపని చేసినా ప్రతికూల ఫలితాలొచ్చే వీలుంది. శత్రువుల పీడ అధికమవుతుంది. స్వల్ప తగాదాలూ గోచరిస్తున్నాయి. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ఇతరులపై దురభిప్రాయం ఏర్పరచుకుంటారు. శారీరక, మానసిక ఇబ్బందులు చికాకు పెడతాయి. జీర్ణ, జననేంద్రియ సంబంధ సమస్యలొస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సాధారణ పరిస్థితులుంటాయి. మేలిమి ఫలితాల కోసం నవగ్రహారాధన చేయండి.

తుల (Libra):
వారం ప్రథమార్థంలో తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇష్టకార్య భంగం, బంధుమిత్రులతో విరోధం మానసిక శాంతిని దూరం చేస్తాయి. మీ తెలివితేటలకు గుర్తింపు ఉండదు. అనవసర వ్యవహారాల్లో డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. దీనికోసం అప్పులు చేయాల్సి రావచ్చు. వారం చివర్లో పరిస్థితి మెరుగవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. అందరితో సంత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మేలిమి ఫలితాల కోసం సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

Weekly Horoscope in Telugu :

వృశ్చికం (Scorpio):
ప్రతికూలం కాలం నడుస్తోంది. అభీష్టాలేవీ నెరవేరవు. ప్రతిపనిలో అడ్డంకులు ఎదురవుతాయి. స్వజన, బంధు విరోధం గోచరిస్తోంది. బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటుతనంతో పనులను స్వయంగా చెడగొట్టుకుంటారు. మానసిక ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. నీచమైన ఆలోచనలు చేస్తారు. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సి రావచ్చు. పెద్దల ఆస్తి లేదా విలువైన వస్తువును కోల్పోయే సూచనలున్నాయి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. అకారణ నిందలు, అవమానాలు గోచరిస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్లి జనరల్ చెకప్ చేయించుకోవడం మంచిది. శుభ ఫలితాల కోసం లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి.

ధనస్సు (Sagittarius):
గ్రహస్థితి అనుకూలిస్తోంది. కార్యాలు విజయవంతం అవుతాయి. విచారం తొలగిపోయే పరిస్థితి ఉంది. ఇంతకాలానికి మీ తెలివితేటలకు గౌరవం లభిస్తుంది. ఒత్తిళ్లను అధిగమిస్తారు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. కొత్త వస్తువులను కాంరు. అప్పులు చెల్లించే ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తాయి. వారం మధ్యలో దుఃఖం కలిగించే ఘటన జరుగుతుంది. ఇతరులతో విరోధం గోచరిస్తోంది. జీర్ణకోశ సంబంధ సమస్యలు రావచ్చు. విలువైన వస్తువులను కోల్పోయే వీలుంది. మేలిమి ఫలితాల కోసం శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించండి.

మకరం (Capricorn):
గ్రహస్థితి అనుకూలంగా లేదు. పనులకు విఘ్నాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇతరులను నమ్మి మోసపోతారు. అకారణ విరోధాలు తలెత్తుతాయి. కుటుంబంలో చికాకులు ఉంటాయి. చేయని తప్పుకి నిందలు, అవమానాలు భరించాల్సి రావచ్చు. మానసిక శాంతి దూరమవుతుంది. కొత్త స్నేహాల పట్ల అప్రమత్తంగా ఉండండి. కంటి సంబంధ సమస్యలు సూచిస్తున్నాయి. వేళ తప్పిన భోజనం, హితవుకాని పదార్థాలు తినాల్సి రావడం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులు కూడా ముఖం చాటేస్తారు. ఆత్మధైర్యంతో ముందుకు సాగండి. శుభ ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామిని పూజించండి.

కుంభం (Aquarius):
శుభ ఫలితాలుంటాయి. తామున్న రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రశంసలు, సన్మానాలు అందుకుంటారు. డబ్బు ఇబ్బందులు తొలగిపోతాయి. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొంటారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వారం చివర్లో అనుకోని అదృష్టం విశేష లాభాన్నిస్తుంది. ప్రియతములతో సంభాషణ ఆత్మానందాన్నిస్తుంది. వారం మధ్యలో అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఇతరులకు హామీలు, పూచీకత్తులు ఇవ్వకండి. నిందలు పడాల్సి వస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శుభఫలితాలకు శ్రీవేంకటేశ్వరుని పూజించండి.

మీనం (Pisces):
ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పనులు అనుకున్నట్లుగా సాగవు. వ్యాపార, వ్యవహారాల్లో నష్టాలే ఎక్కువగా ఉంటాయి. సమాజంలో తగిన గౌరవం దక్కదు. మిత్రులతోనూ విరోధం గోచరిస్తోంది.మనసు కలతబారుతుంది. రోగ సంబంధంగా విశేష ఖర్చులుంటాయి. వేళకు భోజనం ఉండదు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. మాట నిలుపుకోలేక పోతారు. కళ్లు, పాదాలకు సంబంధించిన సమస్యలొస్తాయి. వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది. వాహన సౌఖ్యం పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. మేలిమి ఫలితాల కోసం గాయత్రీ మాతను పూజించండి.

గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

1 thought on “వారఫలం (19-06-2022 నుంచి 25-06-2022 వరకు)

  1. వార ఫలాల ఈ-సంచిక ద్వారా మంచి సమాచారం అందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదములు మరియు అభినందనలు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com