Weekly Horoscope in Telugu :
మేషం (Aries):
ఆశించిన ప్రయోజనాలు నెరవేరతాయి. తలపెట్టిన కార్యాలన్నింటా విజయం సిద్ధిస్తుంది. ధనలాభం ఉంది. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రుణాలు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. నూతన విజ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. వారాంతంలో అదృష్టం వరిస్తుంది. సమాజంలో ప్రతిష్ట రెట్టింపవుతుంది. అన్ని రంగాల్లోని వారూ ముందంజలో ఉంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలూ ఫలిస్తాయి. ఖర్చులు అదుపు చేయాలి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త.
వృషభం (Taurus):
అనుకూల కాలం. అభీష్టాలు నెరవేరతాయి. ప్రయత్నించిన కార్యం సఫలం అవుతుంది. ధనధాన్య లాభం ఉంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. స్థిర నిర్ణయంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. పెద్దలు, అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. ఇతరులతో విభేదాలు తలెత్తినా సమసిపోతాయి. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. వారం చివరలో అజాగ్రత్తగా ఉండకండి.
మిథునం (Gemini):
మేలిమి కాలం నడుస్తోంది. తలపెట్టిన కార్యాలు సఫలమవుతాయి. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది. బంధువులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. భవిష్యత్తు కోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తారు. ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. బలహీనతలు బయటపెట్టకండి.
Weekly Horoscope in Telugu :
కర్కాటకం (Cancer):
మిశ్రమ ఫలితాలుంటాయి. పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. అవసరానికి సరిపడినంత డబ్బే సమకూరుతుంది. స్వల్ప తగాదాలుంటాయి. ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోండి. అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచనలూ ఉన్నాయి. ఇష్టం లేని పనులు చేయాల్సి రావచ్చు. వారం ద్వితీయార్థంలో పరిస్థితులు సర్దుకుంటాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవకాశాలు చేజార్చుకోకండి. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలతో చేపట్టే పనులు విజయవంతం అవుతాయి.
సింహం (Leo):
ముఖ్యమైన పనులను వారం మొదట్లోనే ప్రారంభించండి. అవసరాలకు సరిపడా డబ్బు సమకూరుతుంది. విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విజ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. వారం ద్వితీయార్థంలో అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. నిందలు భరించాల్సి వస్తుంది. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఇష్టం లేని పనులు చేయాల్సి రావచ్చు. అలసట చెందుతారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కన్య (Virgo):
అనుకూలమైన కాలం. అభీష్టాలు నెరవేరతాయి. తలచిన పనులు విజయవంతం అవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వారం చివర్లో తగాదాలు గోచరిస్తున్నాయి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. ఇతరులపై దురభిప్రాయాలు ఏర్పడతాయి. ఓపికతో ఉండండి.
తుల (Libra):
ఆటంకాలు ఎదురైనా పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అభీష్టాలు నెరవేరతాయి. పూర్వ స్థానాన్ని చేరుకుంటారు. బంధు మిత్రులు సహకరిస్తారు. ధనలాభం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వస్తు వాహన సౌకర్యాలు సమకూర్చుకుంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. నూతన విజ్ఞానాన్ని పొందే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువు లేదా డాక్యుమెంట్ దొంగతనానికి గురికావచ్చు.
Weekly Horoscope in Telugu :
వృశ్చికం (Scorpio):
ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. అతి కష్టమ్మీద కార్యాలు సఫలమవుతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చులు మితిమీరతాయి. అప్పులు చేయాల్సి రావచ్చు. ఆస్తి అమ్మకానికి చేసే ప్రయత్నాలు అనుకూలించవు. మీ తెలివితేటలకు గుర్తింపు లభించదు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అనుమానాలను దూరం చేయండి. నిరాశ, బద్ధకాన్ని వదిలి కష్టిస్తే ఫలితం దక్కుతుంది. వారం చివరికి బంధుమిత్రుల తోడ్పాటు లభిస్తుంది. ధన సమస్యలు తీరతాయి. కొత్త వస్తువులను కొంటారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.
ధనస్సు (Sagittarius):
ముఖ్యమైన పనులను వారం మొదట్లోనే ప్రారంభిస్తే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని, ఆత్మధైర్యాన్నిస్తాయి. మిత్రులు తోడుగా ఉంటారు. వారం ద్వితీయార్థంలో ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధి నిలకడగా ఉండదు. స్వజనులతోనే విరోధాలు గోచరిస్తున్నాయి. మానసిక అశాంతి ఏర్పడుతుంది. బద్ధకాన్ని వదిలించుకోండి. ఖర్చులు అదుపు చేయాలి. విలువైన వస్తువు దొంగలపాలయ్యే వీలుంది. సంతాన సంబంధ సమస్యలు చికాకు పెడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
మకరం (Capricorn):
పనుల పూర్తికి బాగా శ్రమించాల్సివుంటుంది. అడుగడుగునా ఆటంకాలున్నా కార్యజయం ఉంది. ధన సంబంధ సమస్యలుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం, హామీలు ఉండడం ఇబ్బందుల పాల్జేస్తుంది. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. అనుకున్నవేవీ జరగక మానసిక అశాంతి పెరుగుతుంది. కుటుంబంలో చికాకులుంటాయి. వేళకు భోజనం ఉండదు. వృథా ఖర్చులుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పరిస్థితులను అధిగమిస్తారు. ఆత్మీయులతో భేటీ ఆనందాన్నిస్తుంది.
కుంభం (Aquarius):
అనుకూల ఫలితాలుంటాయి. భాగ్యానికి లోటుండదు. అభీష్టాలు నెరవేరతాయి. ధనలాభం ఉంది. అదృష్టం వరిస్తుంది. వస్తు, వాహన సౌకర్యాలు సమకూర్చుకుంటారు. విందుల్లో పాల్గొంటారు. మానసిక పరిస్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆత్మీయులతో సంభాషణలు ఆనందాన్నిస్తాయి. నూతన విజ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి అవమానాలకు గురయ్యే సూచనలున్నాయి. కంటి సంబంధ సమస్యలుంటాయి.
మీనం (Pisces):
అడుగడుగునా ఆటంకాలుంటాయి. ప్రతి పనికీ విపరీతంగా శ్రమించాల్సి వుంటుంది. వృత్తిలో నష్టాలు గోచరిస్తున్నాయి. అనూహ్యమైన ఖర్చుల వల్ల అప్పులు చేయాల్సి రావచ్చు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల కూడా ధననష్టం, అవమానాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలోనూ చికాకులు తలెత్తుతాయి. మిత్రులతో విరోధం వల్ల మానసిక శాంతి కరువవుతుంది. వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది. స్వల్పంగా డబ్బు చేతికి అందుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.
శుభం భూయాత్
పి.విజయకుమార్
[email protected]