Weekly Horoscope in Telugu :
మేషం (Aries):
కాలం అనుకూలంగా లేదు. అన్ని వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కీలకమైన పనుల పూర్తికి విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ముందుగా వేసుకున్న ప్రణాళికల ప్రకారం సౌకర్యాలు సమకూర్చుకోలేరు. దురభిప్రాయాల వల్ల ఇతరులతో గొడవలొస్తాయి. ఆత్మీయులూ మీ చర్యలను వ్యతిరేకిస్తారు. పర్యవసానాలు మీలో విచారాన్ని పెంచుతాయి. ఉదర, పైత్య సంబంధ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ఉద్యోగులు అత్యంత శ్రద్ధగా వ్యవహరించకుంటే అధికారుల ఆగ్రహానికి గురయ్యే వీలుంది. మేలిమి ఫలితాల కోసం ఇష్టదైవాన్ని ఆరాధించండి.
వృషభం (Taurus):
యోగదాయకమైన కాలం. పనులు సవ్యంగా సాగుతాయి. ధనలాభం గోచరిస్తోంది. బంధుమిత్రుల సహకారంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా ముగిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఇళ్లకు దూరంగా గడుపుతున్నవాళ్లు అయినవారిని కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవితభాగస్వామి తోడ్పాటుతో కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వారం చివర్లో కాస్త అప్రమత్తంగా ఉండండి. అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. ఉదర సమస్యలు ఇబ్బంది పెట్టే వీలుంది. మేలిమి ఫలితాల కోసం గౌరీదేవిని పూజించండి.
మిథునం (Gemini):
మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యమైన కార్యాలను వారం మొదట్లో ప్రారంభించకండి. అభీష్టాలు నెరవేరవు. పైగా చింతలు పెరుగుతాయి. బద్దకాన్ని వదిలిపెట్టండి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరినా, వృథా ఖర్చుల వల్ల ధనం నిల్వ ఉండదు. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందవు. రుణ ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి. వారాంతంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సుఖసంతోషాలుంటాయి. కీలక విషయాల్లో జీవితభాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. శుభఫలితాల కోసం శివుడిని ఆరాధించండి.
Weekly Horoscope in Telugu :
కర్కాటకం (Cancer):
ముఖ్యమైన పనులను వారాంతంలో చేపడితే విజయవంతం అవుతాయి. వారం మొదట్లో డబ్బుకి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి పనికీ అడ్డంకులు వస్తాయి. అవమానాలు, మానసిక ఒత్తిళ్లు భయాన్ని కలిగిస్తాయి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ఆస్తుల క్రయవిక్రయాలు లాభించవు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పొగడ్తలు అందుకున్న చోటే విమర్శలు ఎదురవుతాయి. ముఖ్యమైన వస్తువు దొంగలపాలు అవుతుంది. వక్షస్థలానికి సంబంధించిన సమస్యలుంటాయి. వారాంతంలో బంధుమిత్రుల సహకారంతో ఇబ్బందులు తగ్గుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సాయిబాబా ఆరాధన మేలు చేస్తుంది.
సింహం (Leo):
పనులు విజయవంతం అవుతాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. మానసిక సౌఖ్యం లభిస్తుంది. కొత్త వస్తువులు, వస్త్రాలు కొంటారు. మిత్రులు సహకరం, ఆత్మవిశ్వాసాలతో ప్రతి కార్యాన్నీ సఫలం చేసుకుంటారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఆత్మీయులతో సంభాషణలు ఉత్తేజాన్ని ఇస్తాయి. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. వారం ద్వితీయార్థంలో విపరీతమైన ఖర్చులుంటాయి. పూర్వీకుల ఆష్తిని అమ్మే పరిస్థితి సూచిస్తోంది. ఆలోచనలు వక్రమార్గం పడతాయి. శత్రువులు బలం పుంజుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. మేలిమి ఫలితాల కోసం శ్రీనివాసుని పూజించండి.
కన్య (Virgo):
కాలం ప్రతికూలంగా ఉంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం, అకారణ విరోధాల వల్ల ఇబ్బందులొస్తాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. ఇచ్చిన మాట నిలుపుకోని కారణంగా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్యం కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. తల్లి సోదరవర్గం వారి గురించిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆపత్కాలంలో బంధువులు ముఖం చాటేస్తారు. మనసు నిలకడగా ఉండదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రొమ్ము సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. శనైశ్చరుడికి తైలాభిషేకం మేలు చేస్తుంది.
తుల (Libra):
ప్రతి పనీ ప్రారంభించేముందు ఆచితూచి వ్యవహరించాలి. ఉత్సాహాన్ని నీరుగార్చే ఘటనలు ఎదురవుతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. అనుకున్నవి సాధించలేని పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో కూడా చిరు తగాదాలు చోటుచేసుకుంటాయి. అకారణ విరోధాల వల్ల సమాజంలో ప్రతిష్ట దెబ్బతింటుంది. కళ్లు, గొంతు సంబంధ సమస్యలు సూచిస్తున్నాయి. ఎవరికీ హామీ ఇవ్వకండి. వారం చివరలో కాస్త మనశ్శాంతి లభిస్తుంది ఆత్మధైర్యంతో ముందడుగు వేయాలి. బంధుమిత్రులు సహకరించే పరిస్థితి ఉండదు. వారాంతంలో ప్రయాణాలను వాయిదా వేసుకోండి. మేలిమి ఫలితాల కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి.
Weekly Horoscope in Telugu :
వృశ్చికం (Scorpio):
కాలం ప్రతికూలంగా ఉంది. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో నష్టశాతమే అధికంగా ఉంటుంది. బంధువులు, ఆత్మీయులతో విరోధాలుంటాయి. దూర ప్రదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. ఉద్యోగస్తులు, ప్రభుత్వ పదవుల్లోని వారు పదవీచ్యుతులయ్యే సూచనలున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నిందలపాలయ్యే వీలుంది. అందరితోనూ జాగ్రత్తగా మెలగండి. శారీరక సమస్యలు చికాకు పెడతాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ఎవరికీ హామీలు ఇవ్వకండి. మాట చెల్లుబాటు కాదు. వేళ తప్పిన భోజనం చేయాల్సి ఉంటుంది. మేలిమి ఫలితాల కోసం శనైశ్చరుడికి తైలాభిషేకం మేలుచేస్తుంది.
ధనస్సు (Sagittarius):
కీలకమైన పనులు వారం మొదట్లో ప్రారంభించండి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. రుణాలు చెల్లించే ప్రయత్నాలు ఫలించవు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వారం ద్వితీయార్థంలో ఆర్థిక, వ్యవహార నష్టాలు గోచరిస్తున్నాయి. బంధు, మిత్రులతో విరోధాలు గోచరిస్తున్నాయి. తల, పాదాలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెట్టొచ్చు. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. వారం చివర్లో అదృష్టం వరిస్తుంది. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకండి. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగులు బద్ధకం కారణంగా పదవీచ్యుతలయ్యే వీలుంది. శుభ ఫలితాల కోసం నవగ్రహారాధన చేయండి.
మకరం (Capricorn):
మిశ్రమ ఫలితాలుంటాయి. అభీష్టాలు నెరవేరతాయి. పనులు విపరీత శ్రమ తర్వాత ఫలిస్తాయి. పెద్దల ఆదరాభిమానాలు పొందుతారు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. అదుపు తప్పిన ఖర్చుల వల్ల కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వారం చివర్లో మానసిక అశాంతి పెరుగుతుంది. సమాజంలో గౌరవం తగ్గుతుంది. బద్దకం వల్ల గొప్ప ఆపదను కొనితెచ్చుకుంటారు. ఇతరుల వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. వేళకు భోజనం ఉండదు. మేలిమి ఫలితాల కోసం సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.
కుంభం (Aquarius):
వారం ప్రారంభంలో విచారకర పరిస్థితులుంటాయి. పనుల పూర్తిగా బాగా శ్రమించాలి. ఆత్మీయులు అనుకున్న వారితోనే విరోధం ఏర్పడుతుంది. చేస్తున్న వృత్తులలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భగవదనుగ్రహంతో కష్టాలు గట్టెక్కుతారు. అభీష్టాలు నెరవేరతాయి. చక్కటి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఇతరులతో విభేదాలు తలెత్తినా అంతిమ విజయం మీదే అవుతుంది. అధికార వృద్ధి గోచరిస్తోంది. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది. కొత్త అంశాల్లో విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. మరిన్ని మేలిమి ఫలితాల కోసం గౌరీదేవిని పూజించండి.
మీనం (Pisces):
ప్రతికూల కాలం నడుస్తోంది. పనులు సవ్యంగా సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. అనుకున్న మేరకు సౌకర్యాలు సమకూర్చుకోలేరు. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. బంధుమిత్రులతో విరోధాలు గోచరిస్తున్నాయి. ఉదర సంబంధ సమస్యలు వేధిస్తాయి. వృత్తుల్లోని వారు బద్దకాన్ని వీడి శ్రద్ధతో పనిచేయాలి. మీ బలహీనతలను బయటపెట్టకండి. శత్రువులు వృద్ధి చెందుతారు. పిత్రార్జిత ఆస్తులు పొందడంలో జాప్యం సూచిస్తోంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శుభ ఫలితాల కోసం గణపతిని పూజించండి.
గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.
శుభం భూయాత్
పి.విజయకుమార్
[email protected]
వార ఫలాల ఈ-సంచిక ద్వారా మంచి సమాచారం అందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదములు మరియు అభినందనలు