Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Weekly Horoscope in Telugu :

మేషం (Aries):
శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. పనులన్నీ విజయవంతం అవుతాయి. అభీష్టాలు నెరవేరతాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. బంధువులు, అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. కొత్త స్నేహాలు లాభిస్తాయి. శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. సంతాన విషయాలు సంతృప్తినిస్తాయి. వారం చివర్లో ఖర్చులు మితి మీరతాయి. ఆసుపత్రులకు వెళ్లాల్సిరావచ్చు. అన్నివిషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం (Taurus):

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. తలచిన ప్రతి కార్యమూ నెరవేరుతుంది. ఆటంకాలన్నీ అవలీలగా దాటేస్తారు. డబ్బుకి సమస్య ఉండదు. స్థిర చిత్తం, ఆత్మవిశ్వాసంతో ప్రతి అవకాశాన్నీ అనుకూలంగా మలచుకుని లాభాలు పొందుతారు. బంధువుల్లో గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆదరాభిమానాలు దక్కుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మేలిమి భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు.

మిథునం (Gemini):
మిశ్రమ ఫలితాలుంటాయి. వారం ద్వితీయార్థంలో మేలిమి ఫలితాలుంటాయి. చేస్తున్న పనుల్లో విజయం దక్కుతుంది. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. తండ్రితోను, జీవిత భాగస్వామి సోదరులతోను సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. వారం మొదట్లో కొన్ని చికాకులొస్తాయి. స్వల్ప తగాదాలుంటాయి, పెద్దల కోపానికిగురవుతారు. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. తలచిన సౌకర్యాలు సమకూర్చుకోలేరు. ఖర్చులు తగ్గించండి.

Weekly Horoscope in Telugu :

కర్కాటకం (Cancer):
ముఖ్యమైన పనులు వారం ప్రారంభంలోనే చేపట్టండి. ధనలాభం ఉంటుంది. వస్తు, వాహన సౌఖ్యం దక్కుతుంది. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహాలు పాటించండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వారం ద్వితీయార్థంలో ఇష్టంలేని పనులు చేయాల్సి రావచ్చు. చుట్టుపక్కలున్న వారిపై అనుమానాలు పెంచుకుంటారు. స్వల్ప తగాదాలూ గోచరిస్తున్నాయి. జీర్ణ, జననేంద్రియ సంబంధ సమస్యలు గోచరిస్తున్నాయి. త్వరగా అలసిపోతారు. అనుకోని అదృష్టం వరిస్తుంది.

సింహం (Leo):
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. అభీష్టాలు నెరవేరతాయి. ఈ క్రమంలో కొద్దిపాటి అడ్డంకులను ఎదుర్కోవాల్సి వుంటుంది. బంధుమిత్రుల సహకారంతో శుభ ఫలితాలు పొందుతారు. కొత్త వస్తువులను కొంటారు. వాహనయోగమూ ఉంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ చికాకులను అధిగమిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. శారీరక, మానసిక ఆనందం కలుగుతుంది. వారం చివర్లో అనవసర వ్యవహారాల్లో తలదూర్చి తగవులు తెచ్చుకుంటారు. ఖర్చులు అదుపు చేసుకోండి.

కన్య (Virgo):
అనుకున్న పనులు పూర్తవుతాయి. క్లిష్టమైన కార్యాల్లోనూ విజయం లభిస్తుంది. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. నూతన వస్తుప్రాప్తి ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన విషయాలు గ్రహిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆత్మీయుల తోడ్పాటుతో చిన్నపాటి చికాకులు, అడ్డంకులను దాటేస్తారు. శారీరక ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చులు అదుపు చేయాలి. ముఖ్యమైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త.

తుల (Libra):
కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. చికాకులు ఎన్నొచ్చినా అంతిమ విజయం మీకే దక్కుతుంది. జీవిత భాగస్వామి మూలకంగా, అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. కొత్త వస్తువులు కొనే ప్రయత్నాలు వారాంతానికి ఫలించే వీలుంది. వారం తొలిభాగం ప్రతికూల ఫలితాలే ఎక్కువుంటాయి. అయినవారితోనే విరోధాలు, మనసు నిలకడగా లేకపోవడం చికాకు పరుస్తాయి. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. ఖర్చులు అదుపు చేయండి. అనుమానాలు, భయాందోళనలు వీడి ఆత్మవిశ్వాసంతో సాగండి.

Weekly Horoscope in Telugu :

వృశ్చికం (Scorpio):
ముఖ్యమైన పనులు వారం ప్రారంభంలోనే చేపట్టండి. ప్రతి కార్యానికీ ఆటంకాలు తప్పవు. బద్దకం వదలి అభీష్ట సిద్ధికి విపరీతంగా శ్రమించాలి. స్వజనులతోనే విరోధం గోచరిస్తోంది. మానసిక అశాంతి, నిలకడ లేమి వల్ల మీరే పనులు చెడగొట్టుకునే సూచనలున్నాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆస్తి విక్రయ ప్రయత్నాలు అనుకూలించవు. అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం.. మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.

ధనస్సు (Sagittarius):
మిశ్రమ ఫలితాలుంటాయి. పనుల పూర్తికి బాగా శ్రమించాలి. డబ్బు బాగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆత్మవిశ్వాసంతో, అకుంఠిత దీక్షతో కార్యాలు సాధిస్తారు. ఇతరులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అకారణ విరోధాలూ తలెత్తుతాయి. మాట చెల్లుబాటు కాదు. వేళకు భోజనం దక్కదు. శత్రువుల పీడ పెరుగుతుంది. మనసు నిలకడగా ఉండదు. జీవిత భాగస్వామి సలహాలతో చికాకులు అధిగమిస్తారు. మిత్రులూ సహకరిస్తారు. ఆత్మీయుల కలయిక అమితానందాన్ని కలిగిస్తుంది. ఖర్చులు అదుపు చేయాలి.

మకరం (Capricorn):
మేలిమి ఫలితాలుంటాయి. అభీష్టాలు నెరవేరతాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. వాహన యోగం ఉంది. శుభకార్యాలు, విందుల్లో పాల్గొంటారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. నిరుద్యోగులకు మేలిమి కాలం. ఉద్యోగస్తుల బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. మిత్రులు సహకరిస్తారు. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. వారం మధ్యలో ఖర్చులు అదుపు చేయాలి. నోరు జారకండి. అకారణ నిందలు రావచ్చు. కంటి సంబంధ సమస్య ఇబ్బందిపెట్టొచ్చు.

కుంభం (Aquarius):
మిశ్రమ ఫలితాలుంటాయి. పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆటంకాలను అధిగమించి శుభ ఫలితాలు పొందుతారు. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. ఖర్చులు అదుపులో ఉంచండి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన విషయాలను తెలుసుకుంటారు. బంధువులతో విరోధం ఏర్పడవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు లాభించవు. ఇంటికి దూరంగా గడపాల్సి రావచ్చు. బంధుహాని సూచిస్తోంది.

మీనం (Pisces):
మేలిమి ఫలితాలుంటాయి. అభీష్టాలు నెరవేరతాయి. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. వాహన యోగం ఉంది. ఇతరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభకార్యాలు, విందుల్లో పాల్గొంటారు. రుణాల చెల్లింపు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. వారం మధ్యలో స్వల్ప ప్రతికూలత ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో మాట తూలకండి. గౌరవానికి భంగం రావచ్చు. ఖర్చు అదుపు చేయాలి.

గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com