Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Weekly Horoscope in Telugu :

మేషం (Aries):
తలపెట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు. కీలకమైన విషయాల్లో, సొంత తెలివితేటలు ఉపయోగించకుండా ముఖ్యుల సలహాలు తీసుకోండి. అవసరాలకు సరిపడా డబ్బు సమకూరుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆవేశం, ఉద్రేకాన్ని అదుపు చేసుకోకపోతే విపరీతంగా విచారించాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలు కొంచెం చికాకుని కలిగిస్తాయి. సంతాన విషయంలో మీ అంచనాలు తల్లకిందులవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతారు. నిరుద్యోగులు ఇంకొంత కాలం వేచివుండక తప్పదు. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారు తగాదాల్లో చిక్కుకునే పరిస్థితి గోచరిస్తోంది.

వృషభం (Taurus):
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో చేపట్టిన పనులు సఫలం కావు. నిరాశ, మానసిక చింతలు కలుగుతాయి. డబ్బు కూడా విపరీతంగా ఖర్చవుతుంది. అన్ని విషయాల్లోనూ అనుమానాలే కలుగుతుంటాయి. తెలివితేటలు, సంతానం విషయాల్లో వృద్ధి కనిపించదు. వారం మధ్యలో శుభఫలితాలుంటాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. అవసరమైన డబ్బు సమకూరుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. జీవిత భాగస్వామితో గోడవలొచ్చే వీలుంది. వారాంతంలో సంతానం గురించి శుభవార్త వింటారు. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభించదు. నిరుద్యోగులకు అనుకూల కాలం. వృత్తి ఉద్యోగాల్లోని వారు ఇబ్బందుల నుంచి బయటపడతారు.వ్యాపార రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారు తొందరపాటు వదలాలి.

మిథునం (Gemini):
అందివచ్చిన అవకాశాలు చేజారే వీలుంది. ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతుంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. బంధువులే విరోధుల్లా వ్యవహరిస్తారు. మానసిక ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ఇంటి వాతావరణం కూడా చికాకు పెడుతుంది. నీచపు ఆలోచనలు వస్తాయి. బద్దకం పెరుగుతుంది. జరుగుతున్న పరిణామాలు మీలో భయాన్ని పెంచుతాయి. విలువైన వస్తువు దొంగతనం కావచ్చు. స్త్రీలలో గర్భకోశ సమస్యలు గోచరిస్తున్నాయి. దాంపత్య జీవనం కూడా ఒడుదుడుకుల్లో పడుతుంది. సంతానం కోరుకునే వారు శుభవార్త వింటారు. విద్యార్థులు మెరిట్‌ స్కాలర్‌షిప్పులకు అర్హులవుతారు. నిరుద్యోగులు వేచివుండక తప్పదు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అంతర్గత శత్రువుల వేదన ఉంటుంది. వ్యాపార రంగంలోని వారికి ఆశించిన లాభాలు దక్కవు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి పోటీదారుల నుంచి సమస్యలుంటాయి.

Weekly Horoscope in Telugu :

కర్కాటకం (Cancer):
పనులు అనుకున్నట్లుగా జరగవు. ప్రతిపనికీ విపరీతంగా శ్రమించాల్సి వుంటుంది. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. మాట నిలుపుకోలేక పోతారు. హామీలు, పూచీకత్తులు ఉండకండి. మీ ధైర్యసాహసాలను దెబ్బతీసేందుకు శత్రువులు ప్రయత్నిస్తారు. సోదరవర్గం కూడా మీ చర్యలను తప్పుబడుతుంది. ఆస్తుల వ్యవహారాల్లో దాయాదులు ఇబ్బందిపెడతారు. కొత్త ఆలోచనలు, నూతన ప్రయత్నాలేవీ ఫలించవు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. జీవితభాగస్వామి వైఖరి మానసిక క్షోభను కలిగిస్తుంది. సంతాన సంబంధ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థుల ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాల్లోని వారు గౌరవాన్ని కోల్పోతారు. వ్యాపార రంగంలోని వారికి అధికారుల మూలకంగా సమస్యలుంటాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారు అప్రమత్తంగా ఉండాల్సిన కాలమిది.

సింహం (Leo):
ప్రతి పనికీ విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. అవసరానికి తగ్గ డబ్బు సమకూరుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేవీలుంది. బంధువులను కలుసుకుంటారు. ఇరుగు పొరుగువారితో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మిత్రులే శత్రువులుగా వ్యవహరిస్తారు. చక్కటి భవిష్యత్తుకోసం ప్రణాళికలు రచించుకుంటారు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సంతానానికి సంబంధించి మంచి వార్త వింటారు. జీవితభాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. సంతానం కోరుకునే వారు శుభవార్తను వింటారు. విద్యార్థులు గురువుల ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాల్లోని వారు పై అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. వ్యాపార రంగంలోని వారు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్‌ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది.

కన్య (Virgo):
అప్రమత్తంగా ఉండాల్సిన కాలమిది. ప్రతిపనినీ ఆచితూచి చేయాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా గొప్ప ఆపదలో కూరుకుపోతారు. ఊహించని ఖర్చులుంటాయి. అనుభవం లేని పనుల్లో డబ్బు నష్టపోయే వీలూ ఉంది. ప్రయాణాలు ఏమాత్రం అనుకూలించవు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ వ్యక్తిగత ప్రతిష్ట, ఆకర్షణ తగ్గడాన్ని గ్రహిస్తారు. మాట నిలుపుకోలేకపోతారు. అకారణ విరోధాలు తలెత్తుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవితభాగస్వామి తోడ్పాటు ధైర్యాన్నిస్తుంది. సంతాన సంబంధ విషయాలు దుఃఖాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు విదేశీ విద్యకోసం చేసే ప్రయత్నాలు ఈవారం అనుకూలించవు. నిరుద్యోగులు వేచివుండక తప్పదు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు దక్కవు. వ్యాపార రంగాల్లోని వారికి విపరీతమైన ఖర్చులుంటాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారు పోటీతత్త్వం వల్ల నష్టపోతారు.

తుల (Libra):
శ్రమిస్తేనే పనులు అనుకూలిస్తాయి. డబ్బు అందినట్లే అంది చేజారుతుంది. ఖర్చులు పెరుగుతాయి. జూదం మంచిది కాదు. వేళ తప్పిన భోజనం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులే విరోధులుగా మారే వీలుంది. అప్రమత్తంగా ఉండాలి. నిద్రలేమి వేధిస్తుంది. ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. కుటుంబంలో సౌఖ్యం లోపిస్తుంది. జీవిత భాగస్వామి వైఖరి ఆందోళన కలిగిస్తుంది. సంతానానికి దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలు దూరమవుతాయి. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందవు. నిరుద్యోగులకు ఆందోళన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార రంగంలోని వారికి నష్టాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌ రంగంలోని వారికి న్యాయపరమైన చిక్కులొస్తాయి.

Weekly Horoscope in Telugu :

వృశ్చికం (Scorpio):
అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. రుణాలు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతారు. కొత్త స్నేహాలు వృద్ధి చెందుతాయి. శారీరక, మానసిక శాంతి లభిస్తుంది. వారం మధ్యలో మితిమీరిన ఖర్చులుంటాయి. తెలియని పనుల్లోకి దిగి డబ్బు నష్టపోయే వీలుంది. కోర్టు నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలించవు. కుటుంబ సౌఖ్యానికి దూరమవుతారు. సంతానానికి సంబంధించిన వార్తలు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులు చెడుదారిని పట్టే వీలుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు దూరప్రాతాలకు బదిలీ అయ్యే వీలుంది. వ్యాపార రంగంలోని వారు అగ్రిమెంట్లు కుదుర్చుకునేందుకు అనుకూలమైన కాలం. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారు న్యాయపర చిక్కుల్లో పడతారు.

ధనస్సు (Sagittarius):
యోగదాయకమైన కాలం. అభీష్టాలు నెరవేర్చుకుంటారు. అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి మంచి ప్రణాళికలు రూపొందించుకుంటారు. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. పెద్దలు, మిత్రుల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన ఆలోచనలు ఆవేదనను కలిగిస్తాయి. విద్యార్థులు గురువుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు వృథా ఖర్చులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారు అనవసరపు వివాదాల్లో చిక్కుకుంటారు. వ్యాపార రంగంలోని వారికి విపరీతమైన ఖర్చులుంటాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారు చక్కటి లాభాలు పొందుతారు.

మకరం (Capricorn):
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో కాస్త ప్రతికూలతలున్నా క్రమంగా సానుకూలపడతాయి. ఇతరులతో విరోధం ఏర్పడినప్పటికీ, విజయం మీకే దక్కుతుంది. పెద్దలు, మిత్రుల ఆదరాభిమానాలను పొందుతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి తల్లి సాయం లభిస్తుంది. అభీష్టాలు నెరవేరతాయి. లభించిన అవకాశాలను ఉపయోగించుకుని, చక్కటి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సంతానానికి ఆర్థిక ప్రయోజనాలు దక్కక పోవడం బాధిస్తుంది. విద్యార్థులు స్కాలర్‌షిప్‌ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు. నిరుద్యోగులకు ఇంకొంత కాలం ఎదురు చూపులు తప్పవు. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి చికాకులు తప్పవు. వ్యాపార రంగంలోని వారికి నష్టాలుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు వెంచర్ల విస్తరించేందుకు అనుకూలంగా ఉంది.

కుంభం (Aquarius)
వారం ప్రారంభంలో అనుకున్న పనులు నెరవేరవు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనవసర వివాదాలకు దిగుతారు. స్థాయిని మరచి పోటీలకు దిగితే అవమానం తప్పదు. వేళకు భోజనం, నిద్ర ఉండదు. పేగులు, కీళ్లకు సంబంధించిన సమస్యలు వేధిస్తాయి. వారం ద్వితీయార్థంలో అంతా అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆదరాభిమానాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సర్వత్రా విజయం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. దూరప్రాంతాల్లో విద్య కోసం విద్యార్థులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. వ్యాపార రంగంలోని వారికి కష్టకాలమనే చెప్పాలి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి విపరీతమైన ఖర్చులుంటాయి.

మీనం (Pisces):
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన పనులను వారం ప్రారంభంలోనే చేపట్టండి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు దృఢపడతాయి. వాహన యోగం గోచరిస్తోంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వారాంతంలోపనులకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. అనూహ్యమైన ఖర్చులు వస్తాయి. ఆత్మీయులతో గొడవల వల్ల మానసిక శాంతి లోపిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. జీవితభాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. సంతానం వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. విద్యార్థులు చెడు స్నేహాల వైపు ఆకర్షితులయ్యే వీలుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడాలి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఉన్నతాధికారుల మూలంగా ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాపార రంగంలోని వారికి నష్టాలు గోచరిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి అధికారుల మూలంగా భయాందోళనలు పెరుగుతాయి.

గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

1 thought on “వారఫలం (28-11-2021 నుంచి 04-12-2021 వరకు)

  1. వార ఫలాల ఈ-సంచిక ద్వారా మంచి సమాచారం అందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదములు మరియు అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com