Share to Facebook Share to Twitter share to whatapp share to telegram
Weekly Horoscope in Telugu :

మేషం (Aries):
సుఖసంతోషాలతో వారం ప్రారంభం అవుతుంది. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణమూ అనుకూలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వారం మధ్యలో అనూహ్యమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి. బంధువులతో విరోధం గోచరిస్తోంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. అధికంగా శ్రమించాలి. వృత్తి, ఉద్యోగాల్లోని వారు, శత్రుపీడ లేకుండా చేసుకుంటారు. అయితే, విపరీతమైన కార్యభారం మోయాల్సి ఉంటుంది. వ్యాపార రంగంలోని వారు చక్కటి లాభాలను పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు లిటిగేషన్ వ్యవహారాల్లో సతమతమయ్యే సూచనలున్నాయి. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఇష్టదైవాన్ని ప్రార్థించండి.

వృషభం (Taurus):
అత్యంత యోగదాయకంగా ఉంటుంది. చక్కటి ఆలోచనలతో మేలిమి భవిష్యత్తుకి పునాదులు వేసుకోండి. తలచిన పనులు నెరవేరుతాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. పెద్దలు, ఆత్మీయుల సహకారం మీకు ఉత్సాహాన్నిస్తుంది. మీతో పోటీ పడే వారిమీద, మీదే పైచేయి అవుతుంది. ఇంట్లో సుఖశాంతులుంటాయి. ఇంటికి అవసరమైన సౌకర్యాలను ఏర్పరచుకుంటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. అనవసర ప్రయాణాలు మానుకోండి. విద్యార్థులకు, దూరప్రాంతాల్లో విద్యాభ్యాసం కోసం అవసరమైన ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి భయాలు తొలగి, అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార రంగంలోని వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరించాలి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఆదాయంతో పాటు చికాకులూ ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది.

మిథునం (Gemini):
శుభ ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో కాస్త ఒడుదుడుకులు ఉన్నట్లనిపించినా, రెండు రోజులు గడిచేసరికి పరిస్థితి అదుపులోకి వస్తుంది. తలపెట్టిన కార్యాలు సిద్ధిస్తాయి. పెద్దల ఆదరాభిమానాలు లభిస్తాయి. అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పటిష్టమైన భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటారు. ఈక్రమంలో కొత్త స్నేహితులు సహకరిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ధోరణి అలవాటవుతుంది. వారం చివర్లో ప్రయాణాలు చేయకండి. విద్యార్థులు విపరీతంగా శ్రమించాల్సిన కాలమిది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అవమానాలు, చీవాట్లు అధికంగా ఉంటాయి. నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగ భద్రతకూ ముప్పు రావచ్చు. వ్యాపార రంగంలోని వారికి పోటీదారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు పోటీదారుల ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా ఉండాలి. శ్రీనివాసుడిని ఆరాధించడం వల్ల మరిన్ని మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి.

Weekly Horoscope in Telugu :

కర్కాటకం (Cancer):
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. తలపెట్టిన పనులన్నింటా వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి. బంధుమిత్రులతో స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. వారం మొదట్లో, ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోండి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. క్రమంగా పరిస్థితులు మెరుగవుతాయి. మీతో పోటీ పడేవారికి పరాజయం తప్పదు. రుణాలు చెల్లించే ప్రయత్నం ఫలిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లోని వారికి ప్రారంభంలో మెరుగ్గా ఉన్నా, క్రమంగా పరిస్థితి ప్రతికూలంగా మారుతుంది. ఆచితూచి వ్యవహరించండి. వ్యాపార రంగంలోని వారికి విపరీతమైన ఖర్చులుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మిశ్రమంగా ఉంటుంది. పోటీదారుల కదలికలను గమనిస్తూ ఉండండి. సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది.

సింహం (Leo):
ఈవారం, లాభదాయకంగా ప్రారంభమవుతుంది. ధనాదాయం పెరుగుతుంది. వస్తువాహన సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో అనుబంధాలు పెరుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వారం మధ్యలో ప్రతికూలతలు గోచరిస్తున్నాయి. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పెద్దవారి ఆగ్రహానికి గురవుతారు. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. అనుభవాల ఆధారంగా భవిష్యత్తుకు చక్కటి ప్రణాళిక వేసుకుంటారు. జీర్ణ సంబంధ సమస్య వేధిస్తుంది. విద్యార్థులకు కష్టకాలం. విపరీతంగా శ్రమిస్తేనే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉన్నా, ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మిశ్రమంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. గణపతిని ఆరాధించడం వల్ల మెరుగైన ఫలితాలొస్తాయి.

కన్య (Virgo):
శుభఫలితాలుంటాయి. తలపెట్టిన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీ తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం వృద్ధి చెందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వారం చివర్లో ఆచితూచి వ్యవహరించండి. ఇష్టంలేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. మోకాలి నొప్పులు వేధిస్తాయి. సంతానం వ్యవహారం చికాకు పెడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతారు. విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి స్థానమార్పిడి గోచరిస్తోంది. ఇది మానసిక ఆందోళనను పెంచుతుంది. వ్యాపార రంగంలోని వారు కొత్త అగ్రిమెంట్లు కుదుర్చుకునేందుకు అనుకూల కాలం. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి విపరీతమైన ఖర్చులు, ఆందోళన అధికంగా ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వల్ల మేలైన ఫలితాలుంటాయి.

తుల (Libra):
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో కాస్త ఇబ్బందికరంగా ఉన్నా, రెండ్రోజులు గడిచేసరికి పరిస్థితి అనుకూలిస్తుంది. సోమరితనం వదిలి కష్టిస్తే, తలపెట్టిన పనులు సఫలమవుతాయి. అవమానాలు ఎదురైనా నీచపు ఆలోచనలకు దూరంగా ఉండండి. అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. స్వస్థానంలోని బంధుమిత్రులను కలుసుకుంటారు. కొత్త పనుల కోసం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఏపనినైనా మంగళవారంపైన ప్రారంభించండి. విద్యార్థులకు అత్యంత గడ్డు కాలం నడుస్తోంది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థానచలనం ఉంటుంది. వ్యాపార రంగంలోని వారికి ఖర్చులు అమితంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి, తొందరపాటు నిర్ణయాల వల్ల దుఃఖం కలుగుతుంది. శనైశ్చరుడికి తైలాభిషేకం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి.

Weekly Horoscope in Telugu :

వృశ్చికం (Scorpio):
ప్రతికూల కాలం నడుస్తోంది. తలపెట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులకు సరిపడా డబ్బు చేతిలో ఉండదు. మనసు నిలకడగా ఉండదు. తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు అనుకూలించవు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. విలువైన వస్తువు దొంగతనానికి గురవుతుంది. రుణదాతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. వారం చివర్లో.. మిత్రుల సహకారంతో కష్టాల నుంచి గట్టెక్కుతారు. చేపట్టిన పనులు సానుకూలమవుతాయి. విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. దుర్వ్యసనాలకు ఆకర్షితులు కాకండి. వృత్తి, ఉద్యోగాల్లోని వారు, పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది. వ్యాపార రంగంలోని వారికి శుభప్రదంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి లాభాలున్నా, లిటిగేషన్ వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఈరాశివారికి, అంగారక రుణ విమోచన స్తోత్ర పఠనం వల్ల మేలు కలుగుతుంది..

ధనస్సు (Sagittarius):
అన్నివైపులా మంచి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ, శాయశక్తులా శ్రమించినా పనులు సఫలం కాని పరిస్థితి ఉంటుంది. ఆశించినమేర లాభాలూ సిద్ధించవు. చేతిలో డబ్బు ఉండదు. రుణదాతల ఒత్తిళ్లు పెరుగుతాయి. మనసు నిలకడగా ఉండదు. చింతలు అధికమవుతాయి. అయినా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. వారాంతానికి పరిస్థితులు మారతాయి. తలపెట్టిన పనులు ఫలించడం మొదలవుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఆశిస్తున్న ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది. వ్యాపార రంగంలోని వారికి శుభప్రదంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. కొత్త వెంచర్లు వేసేందుకు అనుకూల కాలం. శివారాధన వల్ల మెరుగైన ఫలితాలు కలుగుతాయి.

మకరం (Capricorn):
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. అన్నివైపులా మంచే జరుగుతుంది. అయితే లేనిపోని భయాందోళన వల్ల పనులు చెడగొట్టుకుంటారు. ఫలితంగా నిందలూ ఎదుర్కొంటారు. కుటుంబంలో కూడా చికాకులుంటాయి. అవసరానికి సరిపడా డబ్బు ఉండదు. పైగా తప్పనిసరి ఖర్చులూ.. మీ మానసిక శాంతిని దూరం చేస్తాయి. ఆస్తి క్రయవిక్రయ ప్రయత్నాలేవీ అనుకూలించవు. మీ ఆలోచన తీరు సరిగా లేక, ప్రతిపనిలోనూ అడ్డంకులు ఎదురవుతాయి. విద్యార్థులు దూర ప్రాంత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి, ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించినా వారమంతా శుభప్రదంగానే సాగుతుంది. వ్యాపార రంగంలోని వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. జాగ్రత్త. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు, ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ప్రయత్నంలో విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి.

కుంభం (Aquarius)
వారంలో అధికభాగం సుఖ, సంతోషాలతో సాగుతుంది. అన్ని రంగాల వారూ.. మిత్రులు, ఆత్మీయుల సహకారంతో ముందంజ వేస్తారు. ఆదాయం మెరుగవుతుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలోనూ శాంతియుత వాతావరణం ఉంటుంది. ఇచ్చిన మాటను నిలుపుకోలేని పరిస్థితి మీ కీర్తికి మచ్చ తెస్తుంది. ఫలితంగా మనసిక అశాంతికి గురవుతారు. మాతృమూర్తి ఆరోగ్యమూ ఆందోళన కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. విద్యార్థులు ఏకాగ్రతతో, విపరీతంగా శ్రమించాల్సిన కాలమిది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. నిర్లక్ష్యంతో ఉద్యోగ భద్రతకు ముప్పు వస్తుంది జాగ్రత్త. వ్యాపార రంగంలోని వారికి మేలిమి కాలమనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఆందోళన, ఖర్చులూ అధికంగా ఉంటాయి. దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల మరిన్న మేలైన ఫలితాలు దక్కుతాయి.

మీనం (Pisces):
అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనులన్నింటిలోనూ విజయం చేకూరుతుంది. కొత్త సౌకర్యాలను సమకూర్చుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. వారంలో అత్యధికశాతం.. ఇంటా, బయటా ఆనందదాయకంగా ఉంటుంది. అయితే, ఈర్ష్యపరుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. అకారణ విరోధాలు మీ మానసిక శాంతితో పాటు, కుటుంబ సౌఖ్యాన్నీ చెడగొడతాయి. ధైర్యసాహసాలు, మీ తెలివితేటలతో, పరిస్థితులను నియంత్రించుకోగలుగుతారు. విద్యార్థులకు అన్నివిధాలా సంతోషదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి శ్రమ, ఆందోళనలు అధికంగా ఉంటాయి. వ్యాపార రంగంలోని వారు పట్టువిడుపులతో లేకుంటే నష్టపోయే వీలుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు అనవసరపు లిటిగేషన్‌లో చిక్కుకుంటారు. బయటికి రాలేక సతమతమవుతారు. సాయిబాబా దర్శనం మీకు మేలు చేస్తుంది.

గమనిక : ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.

(శుభం భూయాత్)

పి.విజయకుమార్
[email protected]

1 thought on “వారఫలం (17-10-2021 నుంచి 23-10-2021 వరకు)

  1. వార ఫలాల ఈ-సంచిక ద్వారా మంచి సమాచారం అందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదములు మరియు అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com