Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Weekly Horoscope in Telugu :

మేషం (Aries):
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ధనలాభం ఉంది. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. బంధుమిత్రులు సహకరిస్తారు. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. ప్రయాణాలు ఆనందరకరంగా సాగుతాయి. శారీరక, మానసిక శాంతి లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. వారం చివర్లో ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అనవసర తగాదాలూ సూచిస్తున్నాయి. మీతీరుని పెద్దలు ఆక్షేపిస్తారు. జీర్ణ సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

వృషభం (Taurus):
మేలిమి ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రారంభంలో కొద్దిపాటి ఆటంకాలు తలెత్తినా, పనులు, ఆకాంక్షలను నెరవేర్చుకోగలుగుతారు. బంధుమిత్రులు తోడ్పడతారు. ధనలాభం ఉంది. రుణదాతల ఒత్తిళ్లు కొద్దిగా తగ్గుతాయి. నూతన వస్తువులు కొంటారు. విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో.. కుటుంబంలో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుంది.

మిథునం (Gemini):
మిశ్రమ ఫలితాలుంటాయి. పనులు విజయవంతం అవుతాయి. ఇంటికి, ఉద్యోగాలకు దూరంగా ఉన్నవాళ్లకు స్వస్థాన ప్రాప్తి ఉంది. డబ్బుకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. స్వజనంతోనే విరోధం ఏర్పడుతుంది. మనసు నిలకరడగా ఉండదు. చేజేతులా నష్టాలు తెచ్చుకుంటారు. వృథా ఖర్చులు ఎక్కువవుతాయి. ఇతరుల వ్యవహారాల మూలంగా విరోధాలు పెరుగుతాయి. వాత సంబంధ సమస్యలు ఉంటాయి. వారం చివర్లో బంధుమిత్రులు సహకరిస్తారు. ఆత్మీయులతో సంభాషణలు ఉత్తేజాన్నిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Weekly Horoscope in Telugu :

కర్కాటకం (Cancer):
ముఖ్యమైన కార్యాలు వారం ప్రారంభంలో చేపట్టండి. శుభ ఫలితాలు లభిస్తాయి. మిత్రుల సహకారమూ ఉంటుంది. వారం ద్వితీయార్థం నుంచి ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులు విరోధుల్లా ప్రవర్తిస్తారు. సంతాన సంబంధ సమస్యలుంటాయి. మనసు నిలకడగా ఉండదు. డబ్బుకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి రావచ్చు. ఆస్తి క్రయవిక్రయాలు లాభించవు. మీ తెలివితేటలు ఉపయోగపడవు. బద్ధకం వదిలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విశేష లాభం అందుకుంటారు.

సింహం (Leo):
మిశ్రమ ఫలితాలుంటాయి. చేస్తున్న ప్రతి పనికీ ఆటంకం ఎదురైనా శుభఫలితాలు దక్కుతాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనే సూచనలున్నాయి. వృథా ఖర్చులూ ఎక్కువగానే ఉన్నయి. ఇంటికి దూరంగా గడపాల్సి రావచ్చు. రుణదాతల ఒత్తిళ్లు పెరుగుతాయి. అకారన విరోధాలు తలెత్తుతాయి. అనుకున్నవేవీ సవ్యంగా జరగక పోవడంతో అశాంతి పెరుగుతుంది. తల్లికి లేదా తత్సమానమైన వారి గురించిన ఆందోళన పెరుగుతుంది. అవమానాలు ఎదురవుతాయి. ప్రియతములతో సంభాషణ ఆత్మధైర్యాన్ని నింపుతుంది.

కన్య (Virgo):
యోగదాయక కాలం. భాగ్యం వృద్ధి చెందుతుంది. పనులు విజయవంతం అవుతాయి. ఉపాధి మార్గాలు పెరుగుతాయి. ఆదాయం మెరుగవుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త అంశాలను తెలుసుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్నివైపులనుంచీ మంచి జరుగుతుంది. శారీరక, మానసిక శాంతి కలుగుతుంది. వారం మధ్యలో స్వల్ప విరోధాలు గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఖర్చులు తగ్గించుకోండి. మేలు కలుగుతుంది.

తుల (Libra):
ప్రతికూల ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో నష్టం, బంధు, మిత్ర విరోధం మనసుకు శాంతిని దూరం చేస్తాయి. ఇంటికి దూరంగా గడపాల్సి రావచ్చు. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉండదు. వేళకు భోజనం ఉండదు. ఇతరుల విషయాల్లో జాగ్రత్త. గౌరవ మర్యాదలకు భంగం ఏర్పడుతుంది. దగ్గరివారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తినష్టం గోచరిస్తోంది. వారం మధ్యలో అనుకోని అవకాశం మేలు చేస్తుంది. కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాలి.

Weekly Horoscope in Telugu :

వృశ్చికం (Scorpio):
మిశ్రమ ఫలితాలుంటాయి. స్వల్ప ఆటంకాలున్నా, పనులు సవ్యంగా సాగుతాయి. అవసరానికి సరిపడిన మేర డబ్బు సమకూరుతుంది. అప్పులు తీర్చే ప్రయత్నాలు చేస్తారు. విందుల్లో పాల్గొంటారు. నూతన విషయాలను నేర్చుకుంటారు. మంచి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. కుటుంబ సౌఖ్యం మెరుగవుతుంది. వారం మధ్యలో ఖర్చులు అదుపు చేయాలి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం విరోధులను పెంచుతుంది.

ధనస్సు (Sagittarius):
చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. అభీష్టాలను నెరవేర్చుకోగలుగుతారు. బంధు, మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వాదనల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అధికారులు, కుటుంబ పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. జీవితం అభివృద్ధి దిశగా సాగుతుంది. వారాంతంలో ప్రతికూలతలుంటాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. మిత్రులే విరోధులవుతారు. వృథా ఖర్చులు చేయకండి.

మకరం (Capricorn):
గ్రహస్థితి బాగుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. అభీష్టాలు నెరవేర్చుకుంటారు. ఉద్యోగ, ఉపాధి సంబంధ విషయాల్లో పైవాళ్ల ఆదరణ లభిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే సూచనలున్నాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఇతరులతో జరిపే వాదనల్లో మీమాటే చెల్లుబాటవుతుంది. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకోవద్దు. సంతానంతో విభేదిస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

కుంభం (Aquarius):
ప్రతికూల ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. పనులన్నింటా ఆటంకాలు, వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. అభీష్ట సౌకర్యాలు సమకూర్చుకోలేక పోతారు. ఉద్రేకం మంచిది కాదు. సంతాన సంబంధ సమస్యలుంటాయి. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. ఇంటికి దూరంగా గడపాల్సి వస్తుంది. వారం చివరికల్లా పరిస్థితులు మెరుగవుతాయి. పనుల్లో విజయం, అభీష్టం నెరవేరడం, బంధువుతో విందులు గోచరిస్తున్నాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది.

మీనం (Pisces):
గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులను వారం మొదట్లో చేయండి. పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు సమస్యలుంటాయి. అనవసర తగాదాల్లో ఇరుక్కుంటారు. బంధు మిత్రులు సహకరించరు. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ఉదర సంబంధ సమస్యలుంటాయి. ఇంటికి దూరంగా గడపాల్సి రావచ్చు. ఉద్యోగ, ఉపాధిని కోల్పోయే సూచనలున్నాయి. ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. అలసట అధికమవుతుంది. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com