కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా తీసిన కేజీఎఫ్ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఈ రెండు సినిమాలతో యశ్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే.. కేజీఎఫ్ 2 మూవీ ఎండింగ్ లో కేజీఎఫ్ 3 ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి కేజీఎఫ్ 3 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది..? ఎప్పుడు పూర్తవుతుంది..? ఎప్పుడు థియేటర్లోకి వస్తుంది..? కేజీఎఫ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ 2 చేయాలి. అలాగే ఎన్టీఆర్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయాలి. దీంతో కేజీఎఫ్ 3 ఉంటుందా.? ఉంటే ఎప్పుడు ఉంటుంది..? అనేది ఆసక్తిగా మారింది. తాజా వార్త ఏంటంటే.. డిసెంబర్ లో కేజీఎఫ్ 3 గురించి అనౌన్స్ మెంట్ వస్తుందట. వచ్చే సంవత్సరం అక్టోబర్ లో కేజీఎఫ్ 3 సెట్స్ పైకి వస్తుందని.. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా కంటే ముందుగానే కేజీఎఫ్ 3 చేస్తారా..? లేక ఎన్టీఆర్ మూవీ తర్వాత కేజీఎఫ్ 3 చేస్తారా..? అనేది తెలియాల్సివుంది. ఇక యశ్ విషయానికి వస్తే.. మలయాళం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో సినిమా చేయనున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం మార్ష్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్ 3 ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మరి.. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.