ఒంటికి వెన్నెముక కీలకం- నిటారుగా నిలబడడానికి. ఇంటి నిర్మాణానికి ఇనుము కీలకం- ఇల్లు బలంగా కలకాలం నిలబడడానికి. అలాంటి ఇనుము…అది కూడా టాటా ఇనుము అనువాద మహాసముద్ర బడబానలంలో పడి తెలుగులో పంటికింద రాళ్లుగా, తినలేని ఇనుప గుగ్గిళ్లుగా ఎలా మారిందో చూడండి.
తెలుగు భాషలో నిత్యం వాడుకలో ఉన్న మాటలకే శబ్దరత్నాకర, సూర్యరాయాంధ్ర నిఘంటువులు చూడాల్సిన తెంగ్లిష్ కాలంలో ఈ ప్రకటనలో “తెలివిదనం” ఎంత తెలివిమీరిపోయిందో చూడండి. ఇందులో భాష దృఢత్వాన్ని దెబ్బతీస్తూ…టాటా ఇనుము “వశ్యత” ఎంత తేలిగ్గా వంచి…భాష నడుము విరగ్గొట్టిందో చూడండి.
ఇది టాటా ఇనుము యొక్క “ఉన్నత వంగే గుణం”!
ఇది టాటా ఇనుప “కనిష్ట ఎలాంగేషన్”!
ఇది టాటా ఇనుప “అత్యధిక వశ్యత”!
ఇది టాటా ఇనుప “నిర్మా…”!
(నిర్మా సోపు వారు- టాటా ఇనుము వారు కలిసి సంయుక్తంగా బాగా తెలివిదనంతో ఇనుప వంగే వశ్యతా వ్యాపారంలోకి దిగినట్లున్నారు!)
“కకాలం నిలిచి ఉండు ఈ నిర్మా..” కోసం ఉబలాటపడేవారు ఇపుడే కొటేషన్ పొందగలరు.
గుండె ధైర్యం ఉన్నవారు తూలి పడిపోకుండా…మీ తెలుగు వెన్నెముకను నిటారుగా పట్టుకుని ప్రకటనలో టెక్స్ట్ ను యథాతథంగా చదువుకోగలరు.
“అద్వితీయ నాణ్యతతో మీ ఇంటిని సురక్షితం చేసుకోండి. టాటా టిస్కాన్ 550SD యొక్క వశ్యత దీనిని తేలికగా వంచుతుంది, దృఢత్వం ఏమాత్రం తగ్గకుండా.
ఉన్నత
వంగే గుణం
లోనే ఉంది తెలివిదనం
* అత్యధిక UTS/YS నిష్పత్తి
* కనిష్ట 16% ఎలాంగేషన్
* భూకంపం నుండి అత్యున్నత రక్షణ
TATA
TISCON550SD తెలివిగా ఆలోచించండి. మంచిని ఎంచుకోండి.
ఉన్నత శక్తి 550MPa
అత్యంత ఆదా తక్కువ రీబార్ వినియోగం
ఇపుడే సంప్రదించండి
అత్యధిక వశ్యత, అత్యధిక రక్షణ ఎక్కువ కాలం నిలిచి ఉండు నిర్మా…
కొటేషన్ పొందండి”
సంస్కృతంలో “అయః” అంటే ఇనుము. అలా అర్థం కానిది అనే అర్థంలో “అయోమయం” మాట పుట్టింది. ఇది పేరుగొప్ప టాటావారి “అవశ్య నిర్మా…అయోమయం”!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు