Somu Comments Intentional:
లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే..
ఈ మాట అప్పుడు త్రేతాయుగంలో అన్నారో లేదో తెలియదు
కడపలో పుట్టినోళ్ళంతా హంతకులే అట..
ఇప్పుడు సోములోరు మాత్రం సెలవిచ్చారు
ఇది అతనొక్కడి తప్పు కాదు..
అతనేదో నోటికి అదుపులేక వాగలేదు.
ఇదొక భావజాలం.
ఇదొక ముద్రణా విధానం.
ఉత్తరాంధ్ర మీద వెనకబాటు ముద్ర.
తెలంగాణ మీద నక్సలైటు ముద్ర.
రాయలసీమ మీద ఫ్యాక్షన్ ముద్ర.
మతానికో
కులానికో ముద్ర.
యాస మీద ముద్ర.
భాష మీద ముద్ర.
ఇదొక అనాది విద్య.
అసలు ఆ పెద్దాయన పార్టీనే ఒక ముద్రణాలయం.
శత్రువుల తయారీ కేంద్రం.
పాకిస్తానోళ్ళు మన శత్రువులు.
పాకిస్తాన్ లో వున్న మతస్తులు శత్రువులు.
వాళ్ళు మన దేశంలో వున్నా శత్రువులే.
ఆ మతస్తుల తిండి తినే వాళ్లంతా శత్రువులే..
వారికి మద్దతిచ్చేవాళ్ళు ఏ మతంలో వున్నా శత్రువులే..
క్రైస్తువులు శత్రువులే.
కమ్యూనిస్టులూ శత్రువులే.
ఇదంతా 80-20 రాజకీయవ్యూహం.
మైనారిటీలను ముద్రించే మంత్రం.
మెజారిటీల వోట్లు కొల్లగట్టే ప్రమాదకర తంత్రం.
అది కడప కావచ్చు, కాశ్మీర్ కావచ్చు.
విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు.
అయితే ఐఎస్ఐ
లేదా ఖలిస్తాన్..
ఏదో ఒక ముద్ర రెడీగా వుంటుంది…
ముందు అక్కడున్నది కుక్క అనాలి.
తర్వాత దానికి పిచ్చనాలి..
ఆ పై మనం ఏం చేసినా చెల్లుతుంది.
తోటకూరనాడే.. అదుపులో పెట్టాలని సామెత.
కనీసం చీప్ లిక్కర్ నాడైనా కంట్రోల్ చేయలేకపోయారు.
విజయనగరంలో విగ్రహాలకు అవమానమని..
అంతర్వేదిలో రథం దగ్ధమనీ..
ఆంధ్రప్రదేశ్ అంతటా అవకాశాల కోసం చూసాడు..
అన్నీ విఫలమైనా ప్రయత్నాలు ఆపలేదు.
యుపి మంత్రాలు ఏపిలో పనిచేయవని జ్ఞానోదయం కాలేదు.
ఇప్పుడు కడపదాకా పోయాడు..
ఇదేదో ఆషామాషీగా వాగలేదు.
ఇదిక్కడితో ఆగిపోదు..
రేపు అన్నమయ్యకి, అమీన్ పీర్ కి పేచీ పెడతాడు.
పచ్చగా వున్నసీమలో చిచ్చు రగిలించే ప్రయత్నం చేస్తాడు..
ఇప్పుడు జాగ్రత్త పడాల్సింది జనమే..
-శైలి
Also Read :