Thursday, November 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎవడి గోల వాడిది

ఎవడి గోల వాడిది

Public questions to media:

“రేపిస్ట్ రాజు గాడు ఎలా చచ్చాడో క్లారిటీ లేదు. కావున…టీ వీ చానెళ్ళారా! కొంచెం మీరందరూ ఆ పట్టాల దగ్గరకెళ్లి సరదాగా మీలో ఎవరైనా పడుకొని (శ్రీదేవి చనిపోయినప్పుడు బాత్ టబ్ లో పడుకొని చూపించారు చూడు…అట్టా)
క్షుణ్ణంగా పరిశీలించి
ఏ రైలు గుద్దినది కనుక్కుని
ఆ రైలు మైలేజీ ఎంత?రైలు బరువు ఎంత ?
అసలు ఆ రైలు ఎందుకు అటు వైపు వెళ్తుంది ?
ఏ ఊరు వెళ్తుంది ?
అందులో ప్యాసింజర్లు ఎంత మంది ఉన్నారు?
ఆడవాళ్లు ఎంత మంది?
మగాళ్లు ఎంతమంది?
అసలు వాళ్ళెందుకు ఆ రైలు ఎక్కారు?
వాళ్ళల్లో ఎవరికయినా ఈ రాజు గాడు తెలుసా?
ఆ రైలు డీజిల్ దా?
బొగ్గుదా?
కరెంటుదా ?
లేదా ఎవరైనా వెనకనుండి నెడతారా?
ఆ రైలు నడిపే వ్యక్తి రాజు ని చూశాడా ?
First Reaction ఏంటి ?
రైలు ఎడమ చక్రం కింద పడ్డాడా ?
కుడి చక్రం కింద పడ్డాడా ?
అప్పుడు ఆ రైలు స్పీడ్ ఎంత ??
రైలు రంగు ఏంటీ ?
రైలు నుండి పొగ ఎంత వస్తుంది?
ఆ రైలు ఎప్పుడు తయారు చేశారు ?
ఎవరు తయారు చేశారు?
ఆ రైలు ఇండియాదా బయట దేశందా ?
రైలు రాజుగాడిని గుద్దగానే అమ్మా……అని అరిచాడా ?
వామ్మో……. అని అరిచాడా?
అసలు ఏమి అరవలేదా?
రాజు వేసుకున్న చొక్కా దాని రంగు, బ్రాండ్ ఏంటి?
రాజు ఇంకా గుండు ఎందుకు చేసుకోలేదు ?
అలానే ఎలా తిరిగాడు ?
అసలు రైలు రన్నింగ్ లో ఉన్నప్పుడు రైలు ముందు దూకాడా లేదా అప్పటికే పడుకొని ఉన్నాడా?
వాడు ముక్కలుముక్కలు అయ్యాడా ?
ఊరికినే నలిగినట్టు అయ్యాడా?
రైలుకి తుప్పు పట్టి ఉందా ?
మామూలుగానే ఉందా ?
రైలుకి ఇంజన్ ఆయిల్ ఎప్పుడు మార్చారు ?
బ్రేకులు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా?
క్లచ్చు ప్లేట్లు ఫ్రీ గానే ఉన్నాయా?
ఏ గేరు లో ఉన్నాడు?
రాజుగాడి రక్తం రైలుకి అంటుకుందా?
హారన్ కొట్టాడా లేదా హారన్ కొట్టినా పట్టించుకోలేదా?
ఆ పట్టాల మీద ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకుంటున్నారా?

అసలు లోకో పైలట్ ఇంటికి వెళ్లి ఆయన ఇంటర్వ్యూ తీసుకొని ఎంతమంది ఆ రైలు కింద పడ్డారు?
ఎంత మంది బతికారు?
ఎంత మంది చనిపోయారు ?
రాజుగాడిని ఆ టైంలో ఎవరైనా చూశారా ?
చూస్తే ఎవరు, పేరు ఏంటి ?
వాడు మధ్యాహ్నం బిర్యానీ తిన్నాడా ?
పప్పుతో తిన్నాడా ?
అసలు రైలు నడిపే ఆయన బ్రేకులు వేశాడా లేదా?
అసలు ఇది రైలు గుద్దినదా ?
సుత్తి తీసుకొని దవడ పగలకొట్టారా?

ఇవన్నీ కనుక్కుని కొంచెం క్లారిటీ ఇవ్వగలరు.”

(ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు. ఎవరు రాశారో తెలియదు. ప్రశ్నలు అతిశయోక్తిగా ఉన్నా…మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రశ్నలు ఇంతకంటే భిన్నంగా అయితే లేవు.)

RELATED ARTICLES

Most Popular

న్యూస్