83 Years Kiran bai Shocking Gym Workout :
కిరణ్ బాయి వయసు 82 ఏళ్ళు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఉండేది. తన రోజువారీ పనులు చేసుకోలేకపోయేది. ఇది చూసిన మనవడు చిరాగ్ బామ్మకి చిన్న చిన్న వ్యాయామాలు నేర్పించాడు. ఆమెకు సరదాగా ఉంటూనే చురుకుగా కదిలేలా ఎంపికచేసిన వ్యాయామాలు అతి త్వరగా నేర్చుకుంది కిరణ్ బాయి. చీరకట్టులో ఈమె ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియో వైరల్ అయి మరికొందరికి స్ఫూర్తి కలిగిస్తోంది.
ఆడవాళ్ళలో వ్యాయామాలు చేసేవారు తక్కువే. ఇంట్లో ప్రోత్సాహం ఉంటే తప్ప ఆ జోలికి పోరు. నడక లాంటివి కూడా డాక్టర్ చెప్తే తప్ప చెయ్యరు. అక్కడక్కడ యోగా చేసే అమ్మమ్మ, మారథాన్ చేసే మిలింద్ సోమన్ అమ్మ కనిపిస్తారు. హృతిక్ రోషన్ కూడా వాళ్ళ అమ్మని అరవై ఏళ్ళ వయసులో ఫిట్నెస్ దారిలో నడిపించాడని తెలిసి అబ్బో అనుకుంటాం తప్ప మన అమ్మ కూడా చేస్తుందేమో ప్రయత్నిద్దాం అనే ఆలోచన రాదు.
ఈ రోజుల్లో అందరికీ ఫిట్నెస్ స్పృహ పెరుగుతోంది. ఇదివరకు బరువు తగ్గడం కోసమే ఇవన్నీ అనుకునేవారు. కానీ ఆరోగ్యంగా చురుకుగా ఉండాలంటే ఎంతో కొంత వ్యాయామం అవసరమని అంటున్నారు ఇప్పుడు. జిమ్ములు, వ్యాయామాలు డబ్బున్న వారికోసమే అనే అభిప్రాయం కరిగిపోతోంది. చిన్నవయసు వాళ్ల కోసమే అనేది కూడా తప్పే అంటున్నారు నిపుణులు. మనసుంటే మార్గముంటుందని, చెయ్యాలనుకుంటే వ్యాయామానికి వయసు అడ్డం కాదని నిరూపిస్తున్నారు పైన పేర్కొన్న పెద్దలు. పోను పోను పెద్దాళ్ళ కోసమే ప్రత్యేక జిమ్ములు వెలసినా ఆశ్చర్య పోనక్కర్లేదు.
-కె. శోభ
Read More: కొంగున కట్టేసుకున్న చిత్రాలు
Read More: దేశ ఆర్థికంలో మహిళల పాత్ర