Saturday, January 18, 2025
HomeUncategorizedహిట్ పైనే దృష్టి పెట్టిన విజయ్ దేవరకొండ!

హిట్ పైనే దృష్టి పెట్టిన విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండకి ఇప్పుడు అత్యవసరంగా ఒక హిట్ పడాలి. ఎందుకంటే బ్లాక్ బస్టర్ అనే మాట అటుంచితే, అతను హిట్ అనే మాట వినే చాలాకాలమైంది. విజయ్ దేవరకొండ అభిమానులు ఆయన సినిమాను గురించి మాట్లాడుకునే చాలా రోజులైంది. అందువలన ఈ సారి ఆయన తప్పకుండా హిట్ కొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ ముచ్చట ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో తీరుతుందని విజయ్ దేవరకొండ గట్టి నమ్మకంతో ఉన్నాడని అంటున్నారు. ఆయన అభిమానులు కూడా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘గీత గోవిందం’ హిట్ తరువాత ఆ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కావడంతో, అందరూ కూడా ఆసక్తితో ఉన్నారు. ‘గీత గోవిందం’ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టిన గోపీసుందర్, ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నాడు. బాణీలు బాగా కుదిరాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మృణాళ్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనునున్నారు.

టైటిల్ ను బట్టే ఇది యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ అని అర్థమవుతోంది. గతంలో చిరంజీవి చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకి ఈ కథకి కొన్ని పోలికలు ఉన్నాయనే ఒక టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆ తరహా కథనే అయినా, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. హిట్ ఫార్మేట్ .. అలాంటి కథల్లో ఉండవలసిన కొలతలైతే ఈ కథలో కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి హిట్ పడే అవకాశమైతే ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్