మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124 వ జయంతి సందర్భంగా ఆదివారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో సీతారామరాజు చిత్ర పటానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ పుష్పాలతో నివాళులు అర్పించారు.
భారతమాత ముద్దుబిడ్డ అల్లూరి ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచి ఎందరికో స్ఫూర్తి ఇచ్చారని కొనియాడారు. రంపచోడవరం అటవీ ప్రాతంలో గిరిజనుల ఐక్యతకు కూడా అయన కృషి చేశారని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేలా ఆదివాసీలను పురికొల్పారని, గొరిల్లా యుద్ధ విద్యల్లో వారికి తర్ఫీదు ఇచ్చి తీర్చి దిద్దారని గవర్నర్ పేర్కొన్నారు.