ఎందరో ఉద్యమకారుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి సహకరించిన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచి పోతారని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ వ్యాఖానించారు. ఒకవైపున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆడ్డుకుంటామని చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారని, ఢిల్లీ కి లేఖలు కూడా రాశారని, అయినా సరే కేంద్రం తన ప్రక్రియను వేగవంతం చేసిందంటే అర్ధం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు.
ఇప్పటికైనా జగన్నాటకాలు ఆపి, ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణని ఆపే ప్రయత్నాలు చేయాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడాల్సిందిగా తన పార్టీ ఎంపీలను జగన్ ఆదేశించాలని లోకేష్ సూచన చేశారు.