Saturday, February 22, 2025
HomeTrending Newsఈటెలకు వైద్యం కట్!

ఈటెలకు వైద్యం కట్!

రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్  వ్యవహారంలో తలెత్తిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. నేడు కీలక పరిణామం జరిగింది. ఈటెల నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖను సిఎం కెసిఆర్ కు బదలాయిస్తూ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు.  ఈటల రాజేందర్ శాఖలను మార్చాలని గవర్నర్ తమిళిసైకు ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారు.  ముఖ్యమంత్రి సిఫారసును గవర్నర్ వెంటనే అమూదించారు. ఇకపై వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు ముఖ్యమంత్రి స్వయంగా చూసుకోనున్నారు. నేడు లేదా రేపు ప్రగతి భవన్ కు చేరుకొని కరోనాపై సమీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి. ఇకపై ఈటెల ఏ శాఖా లేని మంత్రిగా కొనసాగనున్నారు,

ఈ విషయమై ఈటెల స్పందిస్తూ శాఖ లేకున్నా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని వెల్లడించారు. శాఖ మార్పు విషయంలో ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉంటాయని,  కరోనాపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్