Saturday, January 18, 2025
Homeతెలంగాణఎకో అర్బన్ పార్కులో సీడ్ బాల్స్

ఎకో అర్బన్ పార్కులో సీడ్ బాల్స్

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ చ‌ల్లే కార్య‌క్ర‌మాన్ని ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. చెట్లను నరకడంవ‌ల్ల‌ వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంద‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసమే సీఎం కేసీఆర్‌ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టార‌ని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేప‌ట్టి దేశవ్యాప్తం చేశారని, ప్రతి ఒక్కరిలో ప్రకృతిని కాపాడుకోవాలనే అవగాహన కల్పించారని మంత్రి కొనియాడారు. జిల్లా ప్రజలంతా త‌మ‌ పుట్టినరోజుల‌ను మొక్కలు నాటి జరుపుకోవాలని సూచించారు. చిన్నగా ఉన్న మయూరి నర్సరీని 2097 ఎకరాల విస్తీర్ణంలో కేసీఆర్ ఎకో అర్బన్ పార్కుగా అభివృద్ధి చేస్తున్నామ‌ని మంత్రి చెప్పారు.

ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నార‌ని చెప్పారు. ఈ పార్కు అభివృద్ధి కోసం త‌న వంతు సహకారం అందిస్తాన‌ని ఆయ‌న తెలిపారు. పదేండ్ల‌ క్రితం మహబూబ్‌న‌గ‌ర్‌లో నమస్తే తెలంగాణ యూనిట్ ప్రారంభానికి వచ్చినప్పుడు సేదదీరుదామంటే ఎక్కడా అవకాశం లేదని, ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనమే క‌నిపిస్తున్న‌ద‌ని ఎంపీ పేర్కొన్నారు. అదేవిధంగా రెండు కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసిన మహిళలందరికీ ఎంపీ సంతోష్ కుమార్‌ ధన్యవాదాలు తెలియ‌జేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్