Sunday, January 19, 2025
Homeతెలంగాణఎమ్మెస్సార్ కన్నుమూత

ఎమ్మెస్సార్ కన్నుమూత

కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) కన్నుమూశారు. అయన వయసు 88 సంవత్సరాలు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెస్సార్ కరోనా లక్షణాలతో 10 రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు (26 ఏప్రిల్) రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.
భోళాతనం, ముక్కుసూటి గా మాట్లాడడం ఎమ్మెస్సార్ నైజం. తెలంగాణా సెంటిమెంట్ విషయంలో సవాల్ విసిరి….. కేంద్రమంత్రి పదవికి, కరీంనగర్ ఎంపీ పదవికి కేసీయార్ రాజీనామా చేయడానికి కారణమయ్యారు ఎమ్మెస్సార్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్