Wednesday, April 2, 2025
Homeతెలంగాణఏపికి బస్సులు బంద్

ఏపికి బస్సులు బంద్

తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు నడపాల్సిన టిఎస్ఆర్టీసి బస్సులను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ఆర్టీసి ఎండి సునీల్ శర్మ తెలియజేశారు. ఉదయం బయలుదేరే బస్సులు మధ్యాహ్నం 12 గంటల లోపు ఏపీకి చేరుకునే అవకాశం లేనదువల్ల బస్సులు నడపలేమన్నారు. తెలంగాణా నుంచి ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాహనాలను కూడా నిలిపివేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ-తెలంగాణ మధ్య కేవలం మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలు మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని సునీల్ శర్మ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్