Mahesh-Mouli: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో మూవీ రానుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు. అయితే.. ఈ సినిమా మల్టీస్టారర్ మూవీ అని.. ఇందులో మహేష్ బాబుతో పాటు బాలకృష్ణ నటించనున్నారని ఓ వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. బాలకృష్ణ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. దాదాపు ఓ ముప్పై నిమిషాల పాటు ఈ క్యారెక్టర్ ఉంటుందని ప్రచారం జరిగింది.
బెంగుళూరులో జరిగిన మీడియా మీట్ లో రాజమౌళి తదుపరి సినిమా గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. మహేష్ బాబుతోనే తన తదుపరి చిత్రం అని.. అది మల్టీస్టారర్ కాదని.. అందులో మహేష్ బాబు ఒక్కరే హీరో అని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. ఇక జూన్ లో త్రివిక్రమ్ తో సినిమా మొదలవుతుంది. వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నాటికి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆతర్వాత మహేష్, రాజమౌళి మూవీ ప్రారంభం కానుందని సమాచారం.