Saturday, January 18, 2025
Homeసినిమా క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.

 క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.

Vikram in June:  యూనివ‌ర్శల్ హీరో కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తూ  లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం విక్ర‌మ్.  ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ మేకింగ్ గ్లింప్స్ తో పాటు విడుదల తేదీని కూడా తాజాగా విడుదల చేశారు మేకర్స్.  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకులను అలరించబోతోంది. విభిన్న క‌థా చిత్రాలు అందిస్తున్న ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ క‌మ‌ల్ హాస‌న్ ని ఎలా చూపించ‌నున్నారు అనేది ఈ సినిమాని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఆస‌క్తిగా మారింది. మ‌రి.. ఈ సినిమాతో క‌మ‌ల్, లోకేష్ ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్