Sunday, January 19, 2025
HomeTrending Newsకరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం : సిఎం కేసీయార్

కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం : సిఎం కేసీయార్

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని, దాన్ని కొనసాగిస్తూనే, ప్రాధమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షలకోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు.  కరోనా పరీక్షలకు సంబంధించి రాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్యను తక్షణమే పెంచాలన్నారు.  అవసరమున్న మేరకు ఉత్పత్తిదారులతో మాట్లాడి సరఫరాను పెంచాలని సూచించారు

బ్లాక్ ఫంగస్  వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్సకోసం రాష్ట్రంలో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు,  మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సిఎం సూచించారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్  వాక్సిన్, లాక్ డౌన్  అమలు పై సోమవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

వైద్య కేంద్రాల్లో కావాల్సిన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు, వైద్యాధికారులకు ఇప్పటికే అధికారాలిచ్చిన నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సిఎం సృష్టం చేశారు.

తక్షణమే రాష్ట్రంలోని డిఎంహెచ్ఓలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించి నియమాకాల  ప్రక్రియ గురించి, దవఖానాల్లో  మందులు తదితర మౌలిక వసతుల అవసరాల గురించి అడిగి తెలుసుకోవాలని, నివేదిక తయారు చేసి తెప్పించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును సిఎం  ఆదేశించారు.  ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని ఎంతటి ఖర్చుకైనా వెనకాడవద్దని సిఎం మరోసారి స్పష్టం చేశారు.

అన్ని పడకలను ఆక్సీజన్ పడకలుగా మార్చాలని రాష్ట్రంలో ఆక్సీజన్ ఉత్పత్తిని 600 ఎం టీలకు పెంచే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు. అదే సందర్భంలో…సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వాల్లు అధికి సంఖ్యలో ఎదురు చూస్తున్నందున వారికి సరిపోను వాక్సిన్లను తక్షణమే సరఫరా చేయాల్సిందిగా సంబంధిత వాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని కరోనా టాక్స్ ఫోర్సు చైర్మన్ మంత్రి కెటిఆర్ ను సిఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ వొకవేల వస్తే ఎదుర్కునేందుకు సిద్దంగా వుండాలని తెలిపారు.

బ్లాక్ ఫంగస్ వ్యాధిని కట్టడి చేయడంలో తీసుకోవాల్సిన కార్యాచరణ గురించి  సిఎం చర్చించారు.  బ్లాక్ ఫంగస్ చికిత్సకోసం గాంధీలో 150 బెడ్లను ఈ.ఎన్.టి. ఆస్పత్రిలో 250 బెడ్లను, మొత్తం కలిపి 400 బెడ్లను కేటాయించినట్లుగా వైద్యాధికారులు సీఎంకు వివరించారు.  సరోజినీ దేవి ఆస్పత్రిలో 200 బెడ్లు, గాంధీ ఆస్పత్రిలో 160 బెడ్లను బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకోసం తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500 కు పెంచాలన్నారు. హైద్రాబాద్ లో  బెడ్లు కనీసం 1100 వరకు, జిల్లాల్లో 400 వరకు మొత్తం 1500 బెడ్లను ఏర్పాటు చేయాలన్నారు.

బెడ్ల సంఖ్యను పెంచడంతో పాటు, బ్లాక్ ఫంగస్ ను తగ్గించే మందులు ఎంత సంఖ్యలో అవసరమున్నదో అంచనా వేసి దానిమేరకు  బ్యాక్ ఫంగస్ చికిత్సకు మందులను తక్షణమే ఆర్డరివ్వాలని సిఎం తెలిపారు. అందుబాటులో వున్న ‘‘పోసకోనజోల్’’ మందు స్టాక్  తక్షణమే పెంచాలని, అందుకు తగు చర్యలు చేపట్టాలని సిఎం సూచించారు. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను యుద్దప్రాతిపదికన నియమించుకోవాలని సిఎం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్