Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కొత్త వైరస్ నారా కరోనా

కొత్త వైరస్ నారా కరోనా

రాష్ట్రంలో కొత్త వైరస్ వచ్చిందని అది ఎన్ 440కే కాదని, దానిపేరు నారా కరోనా 420 అని పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త వైరస్ వచ్చిందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంటున్న చంద్రబాబుకి కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

24 గంటల్లో 6 లక్షల మందికి వాక్సిన్ వేసిన ఘనత ఏపి ప్రభుత్వానికి ఉందని, వాక్సిన్ కోసం భారత్ బయోటెక్, సీరం సంస్థలకు లేఖలు రాశామని, కాని ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థిని ఉందని నాని వివరించారు. దేశంలో ఈ రెండు కాకుండా వేరే ఇతర  కంపెనీలు ఏమైనా ఉన్నాయా అని నాని ప్రశ్నించారు.   వాక్సిన్ కోసం రూ. 1600 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, వాక్సిన్ ఇప్పించే వారు ఎవరైనా వుంటే రావాలి, ఎవరి అకౌంట్లో డబ్బులు వేయాలో చెప్పాలని సవాల్ చేశారు. కొత్త వైరస్ పై చంద్రబాబు ప్రజల్లో అపోహలు సృష్టి స్తున్నారని, వైరస్ పుట్టింది కర్నూల్ లో కాదని నారావారిపల్లెలో అని కొడాలి వ్యాఖానించారు.

చంద్రబాబు సింగపూర్ నుంచి ఎప్పుడో వాక్సిన్ తెప్పించుకుని కేవలం తన కుటుంబానికే వేసుకున్నారని, కనీసం ఎన్ టి ఆర్ కుటుంబానికి గానీ, పార్టీలో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి లాంటి నేతలకు గాని వేయలేదని అన్నారు. దమ్ముంటే వాక్సిన్ త్వరగా వచ్చేలా ఆ రెండు కంపెనీలతో మాట్లాడాలని చంద్రబాబుకి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్