Saturday, January 18, 2025
HomeTrending Newsచంద్రబాబు డైరెక్షన్ లో రఘరామ : వైసిపి ఎంపిలు

చంద్రబాబు డైరెక్షన్ లో రఘరామ : వైసిపి ఎంపిలు

నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు ప్రతిపక్ష నేత చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని వైసిపి లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి ఆరోపించారు. కూలాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా రఘురామ మాట్లాడారని, ప్రభుత్వాన్ని అస్థిర పరిచే విధంగా అయన వ్యాఖ్యలు ఉన్నాయని బెయిల్ కోసం పోలీసులు తనపై చేయి చేసుకున్నారంటూ నాటకాలు ఆడుతున్నారని, ప్రాణహాని ఉందంటూ కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిన్నారని  విమర్శించారు. తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో సహచర ఎంపిలు వల్లభనేని బాలశౌరి, శ్రీకృష్ణ దేవరాయలుతో కలిసి మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తమ పార్టీ నేతలు అరెస్టయితే మాట్లాడని చంద్రబాబు రఘురామ కోసం రాష్ట్రపతికి, గవర్నర్ కి లేఖలు రాయడంలో ఆంతర్యం ఏమిటని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. చివరకు రఘురామ కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పావులుగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. రఘురామరాజుపై ఎంపి అయిన తరువాత 2 సిబిఐ కేసులు నమోదయ్యాయని, ఆ కేసుల నుంచి బైట పడేస్తామంటూ చంద్రబాబు  ఆయనకు ఆశ చూపి, ప్రభుత్వంపై కుట్ర చేసేందుకు లోపాయికారీ ఓప్పండం చేసుకున్నారని విమర్శించారు.

సిఎం జగన్ మా అందరికంటే ఎక్కువగా రఘురామరాజుకి ప్రాధాన్యత ఇచ్చారని, కాని అయన దాన్ని నిలుపుకోలేకపోయారని మచిలీపట్టణం ఎంపి బాలశౌరి అన్నారు. అయన గతంలో ఐదు పార్టీలు మారారన్నారు.  పోలీసులు కొట్టారంటూ రఘురామ కొత్త డ్రామాలకు తెరతీశారని, అయితే అవి పొలుసులు కొట్టిన దెబ్బలు కావని వైద్యుల నివేదిక ఇచ్చిందని బాల శౌరి చెప్పారు. గతంలో ఎప్ప్పుడైనా, ఏ ఎంపి అయినా ఇలాంటి భాష ఉపయోగించారా అనేది అందరూ ఆలోచించాలని సూచించారు. సిఎం జగన్, మంత్రులపై నిరాధార ఆరోపణలు చేశారన్నారు.

చంద్రబాబు చెప్పిందే రఘురామ పాటిస్తున్నారని, అయన కేసులో ప్రభుత్వం చట్ట ప్రకారమే వ్యవహరిన్స్తుందని నరసరావు పెట్ ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, స్టాండింగ్ కమిటి సమావేశాల సమయంలో మాత్రమె ఎంపి అరెస్టుపై స్పీకర్ కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. నిబంధనలకు లోబడే రఘురామ అరెస్ట్ జరిగిందని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టె విధంగా అయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్చించారు. రమేష్ ఆస్పత్రికి తరలించాలంటూ ఎందుకు పట్టు బడుతున్నారని, గుంటూరులో వేరే ఆస్పత్రులు ఇంకా లేవా అని ప్రశ్నించారు. రఘురామ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని రాయలు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్