Thursday, January 23, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్చంద్రబాబు విష ప్రచారం : సజ్జల

చంద్రబాబు విష ప్రచారం : సజ్జల

కోవిడ్ పై చంద్రబాబు దుష్ప్రచారం రెండు తెలుగు రాష్టాలకు నష్టం కలిగిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బాబు విషప్రచారం వల్లే ఢిల్లీ ప్రభుత్వం ఏపీ నుంచి ప్రయాణికుల రాకపై ఆంక్షలు విధించిందన్నారు. ఎన్ 440కె అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ 440కె అంత ప్రమాదం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, అయినా చంద్రబాబు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. రాజకీయాలకు ఇది సమయం కాదని, చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కోవిడ్ కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోందని, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి రాజకీయాలు చేయడం తగదని సజ్జల చంద్రబాబుకు హితవు పలికారు.

రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలన్ని సమన్వయంతో పనిచేస్తూ కరోనా నియంత్రణకు కష్టపడుతుంటే వారి మనోభావాలు దెబ్బతినేలా చరబాబు వ్యవహారం వుందని సజ్జల విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్