Sunday, January 19, 2025
HomeTrending Newsపర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకోసం విరివిగా మొక్కలను నాటాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని దుర్గానగర్ పార్క్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానిక MLA దానం నాగేందర్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, పలు శాఖల అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణం విశ్వనగరంగా అభివృద్ధి పథంలోకి పయనిస్తున్న హైదరాబాద్ నగర ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో, పచ్చదనం మద్య ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

అందులో భాగంగానే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ నెల 10 వ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీలు, బస్తీలు, రహదారులను శుభ్రంగా ఉంచడం, దోమల నివారణ కు పాగింగ్ చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్