మే ఒకటి నుంచి ప్రయివేట్ ఆస్పత్రులు వాక్సిన్ స్వయంగా సమకూర్చుకోవాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రయివేటు ఆస్పత్రుల కు సరఫరా చేసిన వాక్సిన్ పైన ఆడిట్ చేస్తామని వెల్లడించారు.
వారం రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు కొంత కుదుట పడుతున్నాయని,ప్రజలు సహకరిస్తున్నారని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు వారాలు చాలా కీలకమని, ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని కోరారు.
ఇప్పటి వరకు 45 లక్షల మందికి వాక్సినేషన్ ఇచ్చామని, లక్షణాలు ఉంటేనే టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ లో 50 వేల బెడ్స్ ఉన్నాయని,
ఆక్సిజన్ బెడ్స్ 18 వేలు, ఐసియు 10 వేలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు.