Sunday, March 15, 2026
Homeవార ఫలాలువార ఫలాలు

వార ఫలాలు

శ్రీ
వారఫలం
(15-03-2026 నుంచి 21-03-2026 వరకు)

మేషం
అభీష్టం నెరవేరుతుంది. చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. పోటీదారులపై పైచేయి సాధిస్తారు. నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు అందుతాయి. అవకాశాలు కలిసివస్తాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వారం చివరలో అనూహ్య ఖర్చులు వస్తాయి. దూరప్రయాణాలను వాయిదా వేయండి.

వృషభం
ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించినా, చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తోన్న కీలక సమస్య పరిష్కారమవుతుంది. వృత్తిగతంగా వృద్ధి గోచరిస్తోంది. ఉన్నతాధికారులు, పెద్దల అభిమానాన్ని పొందుతారు. పోటీలు, పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తారు. ప్రభుత్వ సంబంధ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కీలక నిర్ణయాల్లో మిత్రులు తోడుగా నిలుస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సంతాన సంబంధ శుభవార్తను వింటారు. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. బంధాలు బలపడతాయి.

మిథునం
శ్రమానంతర ఫలితాలుంటాయి. కష్టమనిపించినా అడ్డంకులను అధిగమించి అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల అండ లభిస్తుంది. ప్రమోషన్స్, రివార్డులు పొందే వీలుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ విషయాలు సంతృప్తినిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. పెద్దల కోపానికి గురవుతారు. జీర్ణ సమస్య ఉంటుంది. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంతానం తీరు చికాకు పెడుతుంది. కోపాన్ని అదుపు చేసుకోండి.

కర్కాటకం
చేపట్టిన కార్యాలు సఫలం అవుతాయి. ధనలాభం ఉంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ చూపుతారు. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. వారం ద్వితీయార్థంలో చెప్పుడు మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల ఆత్మీయులను దూరం చేసుకునే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో గడపడం ద్వారా గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కుతారు.

సింహం
వారం శుభప్రదంగా సాగుతుంది. వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగుతాయి. ఆర్థికాంశాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు మేలిమి కాలం. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంది. పుణ్యకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబసౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. వారం చివరలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తగాదాలకు ఆస్కారముంది. ఇష్టంలేని పనిని చేయాల్సి వస్తుంది.

కన్య
అన్ని అవరోధాలను చాకచక్యంగా, అతి తేలిగ్గా దాటేస్తారు. అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. మిత్రుల సహకారంతో కీలక నిర్ణయాల్లో తడబాటును అధిగమిస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దడంలో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ధనలాభం ఉంది. గృహోపకరణాలను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు ప్రశంసలను పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ప్రయాణం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. బద్ధకాన్ని వదలండి. విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర జోక్యాలు వద్దు.

తుల
ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ప్రారంభంలో అన్నీ చిక్కుముళ్లుగానే కనిపిస్తాయి. సమయం గడిచేకొద్దీ అనుకూల ఫలితాలు లభిస్తాయి. డబ్బు వ్యవహారాల్లో దుబారాను తగ్గించండి. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు పాటించండి. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా వేయండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. వారం చివరికల్లా ధనసమస్యలు తీరతాయి. నూతన వస్త్రాలను కొంటారు. సంతానం తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం
సానుకూల ఫలితాలుంటాయి. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కార్యం శుభప్రదమవుతుంది. సోదరులు అండగా ఉంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయుల కలయిక ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. తొందరపాటు వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయే వీలుంది. ప్రశాంతత దూరమవుతుంది. వారం ద్వితీయార్థంలో అప్రమత్తంగా ఉండాలి. అనుమానాలు పెరుగుతాయి. వాత సమస్యలుంటాయి.

ధనుస్సు
మిశ్రమ ఫలితాలుంటాయి. చేపట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అనుకున్నవి జరగవు. హామీని నిలుపుకోని కారణంగా నిందలు పడాల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల చిక్కులొస్తాయి. అకారణ విరోధానికీ ఆస్కారముంది. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వుంటుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. వారం మధ్యలో కీలక నిర్ణయంలో సోదరుల తోడ్పాటు అవసరమవుతుంది. ఎవరికీ పూచీగా ఉండకండి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి.

మకరం
అనువైన ఫలితాలుంటాయి. ధనలాభముంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. అదృష్టం తోడుగా నిలుస్తుంది. నిర్ణయాల్లో స్థిరత్వం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరుల సహకారం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. విందుల్లో పాల్గొంటారు. పెద్దల ప్రశంసలను పొందుతారు. వారం మధ్యలో ఇతరుల విషయాల్లో తలదూర్చడం వల్ల చిక్కులొస్తాయి. పనులకూ విఘ్నాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త. ఖర్చు తగ్గించండి.

కుంభం
వ్యవహారాల్లో ఆచితూచి నడచుకోవాలి. అవసరానికి తగిన డబ్బు అందుతుంది. కుటుంబ వాతావరణం ఉల్లాసాన్నిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. బద్ధకం వల్ల చిక్కుల్లో పడే సూచన ఉంది. అనూహ్యమైన ఖర్చులుంటాయి. గతంలో ఇచ్చిన మాటను తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. మాట పలుకుబడి తగ్గే వీలుంది. ఇంటికి దూరంగా గడపాల్సి వస్తుంది. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేస్తారు. కీలక వ్యవహారంలో అదృష్టం వరిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీనం
చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. రుణ విముక్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. సౌకర్యాలు సమకూరతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ విషయాలు తృప్తిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. కీలక వ్యవహారంలో అదృష్టం కలిసొస్తుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యం జాగ్రత్త.

శుభం భూయాత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular