01-10-2023 నుండి 07-10-2023 వరకూ
Weekly Horoscope in Telugu :
మేషం (Aries):
చేపట్టిన పనులు సఫలమవుతాయి. ఆటంకాలను అధిగమిస్తారు. ధనలాభం ఉంటుంది. మంచి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. వాహన యోగం ఉంది. శారీరక, మానసిక శాంతి లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. బంధు మిత్రులను కలిసి విందుల్లో పాల్గొంటారు. బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఎంచుకున్న రంగంలో ముందంజలో ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మీయులతో సంభాషణలు ఉత్తేజాన్ని ఇస్తాయి. ఎవరికీ పూచీ ఉండకండి. అకారణ విరోధానికి కారణమవుతుంది. కంటి సమస్యలుంటాయి.
వృషభం (Taurus):
మిశ్రమ ఫలితాలుంటాయి. పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందదు. తక్షణ అవసరాల కోసం అప్పులు చేయాల్సి రావచ్చు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. ఇతరుల వ్యవహారాల్లోనూ అనవసరంగా తలదూర్చకండి. నిందలు భరించాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. వారం మధ్యలో అదృష్టం తోడుగా ఉంటుంది. కీలక సమస్య నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి సూచనలు పాటించడం మంచిది. బాధ్యతలతో పాటు గౌరవమర్యాదలు పెరుగుతాయి.
మిథునం (Gemini):
యోగదాయకంగా ఉంటుంది. అభీష్టాలు నెరవేరతాయి. డబ్బుకి లోటుండదు. నూతన వస్తువులు, ఆభరణాలు కొంటారు. అప్పులు చెల్లించే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన గృహనిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులు తోడుగా నిలుస్తారు. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కీలకమైన తరుణంలో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు అదుపు చేయాలి.
Weekly Horoscope in Telugu :
కర్కాటకం (Cancer):
చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. అభీష్టాలన్నీ నెరవేరతాయి. డబ్బు సమస్యలు తీరిపోతాయి. రుణాలు చెల్లిస్తారు. నూతన వస్తు, వాహనాలు కొంటారు. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. పెద్దలు మీకు తోడుగా ఉంటారు. ఇతరులతో విరోధాలు ఏర్పడినా మీకే విజయం లభిస్తుంది. కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. వారం చివర్లో బంధువుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు.
సింహం (Leo):
అభీష్టాలు నెరవేరతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కోరిన వస్తు, వాహనాలు కొనే సూచనలున్నాయి. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. అధికారులు, పెద్దల ఆదరాభిమానాలతో కీలకమైన కార్యంలో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ బలహీనతలను బయటపెట్టకండి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.
కన్య (Virgo):
వారం ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించినా, తలచిన పనులు సానుకూలమవుతాయి. అభీష్టాలు నెరవేరతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారులు, పెద్దల ఆదరణ లభిస్తుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ఇతరులతో విభేదం ఏర్పడినా మీదే జయం. స్థిర నిర్ణయంతో చేపట్టే ప్రతి పనీ సఫలం అవుతుంది. ఇంట్లో శాంతియుత వాతావరణ నెలకొంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తుల (Libra):
ఒడుదుడుకులు ఎదురైనా అభీష్టాలు నెరవేరతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. వస్తు, వాహనాలు కొనే సూచనలున్నాయి. విందుల్లో పాల్గొంటారు. మానసిక శాంతి లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు పాటించండి. విజ్ఞానాభివృద్ధికి అనుకూలమైన తరుణం. బంధుమిత్రులను కలుస్తారు. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. వారం ద్వితీయార్థంలో ఖర్చులు అదుపు చేయాలి. చెడు ఆలోచనల వల్ల అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచనలున్నాయి. పైత్యసంబంధ సమస్యలుంటాయి.
Weekly Horoscope in Telugu :
వృశ్చికం (Scorpio):
యోగదాయకమైన కాలమిది. అభీష్టాలు నెరవేరతాయి. సర్వ కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ధనలాభం ఉంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. దేహసౌఖ్యం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో మిత్రులు తోడ్పాటు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. నూతన వస్తువులను కొంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వారాంతంలో ఖర్చులు అదుపు చేయండి. స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. పెద్దల ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది.
ధనుస్సు (Sagittarius):
ప్రారంభంలో కాస్త ఒడుదుడుకులుగా అనిపించినా అభీష్టాలు నెరవేరతాయి. బంధు, మిత్రుల సహకారంతో శుభఫలితాలు పొందుతారు. ధనలాభం ఉంది. నూతన వస్తు, ఆభరణాలు కొంటారు. ఆత్మీయులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారంలో విజయం సిద్ధిస్తుంది. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. కీర్తి వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కీలక సమస్య పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. నూతన విజ్ఞానాన్ని సంపాదించేందుకు అనువైన సమయమిది.
మకరం (Capricorn):
పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. అడుగడుగునా ఆటంకాలు దుఃఖాన్ని కలిగిస్తాయి. బుద్ధి నిలకడగా ఉండదు. స్వజనులతోనే విరోధం ఏర్పడుతుంది. పనులు పూర్తి కాక మానసిక అశాంతి ఏర్పడుతుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వృథాఖర్చులు చికాకు పరుస్తాయి. వారం చివరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల తోడ్పాటుతో శుభఫలితాలు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.
కుంభం (Aquarius):
ముఖ్యమైన పనులు వారం మొదట్లోనే ప్రారంభించండి. తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అవసరానికి సరిపడినంత డబ్బే సమకూరుతుంది. ఖర్చలు అదుపు చేయాలి. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం మానసిక అశాంతికి కారణమవుతుంది. ఆస్తి విక్రయ ప్రయత్నాలు వాయిదా వేయండి. బద్ధకాన్ని వదిలిపెట్టి ఆత్మవిశ్వాసంతో పనులు చేపట్టండి. స్నేహితులు సహకరిస్తారు. ఆత్మీయులతో సంభాషణలు ఉత్తేజాన్నిస్తాయి. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించండి.
మీనం (Pisces):
ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది. పనుల్లో జాప్యం, ధనవ్యవహారాల్లో నష్టం సూచిస్తోంది. సరిపడినంత డబ్బు చేతికి అందినా, వృథాఖర్చులుంటాయి. మాట నిలుపుకోలేని కారణంగా నిందలు పడాల్సి వస్తుంది. అకారణ విరోధాలు ఉన్నాయి. వారం మధ్యలో మానసికంగా ఆనందాన్నిచ్చే ఘటన జరుగుతుంది. మిత్రులు తోడ్పాటునందిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఆనందాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కార్యాలు సాధిస్తారు. ఆస్తి అమ్మే ప్రయత్నాలు ఆపండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.
శుభం భూయాత్
పి.విజయకుమార్
astrovijay67@gmail.com

జర్నలిజంలో 30 సంవత్సరాలకు పైబడిన అనుభవం.. 15 సంవత్సరాలకు పైగా జోతిష శాస్త్రంలో అధ్యయనం.