Monday, February 24, 2025
Homeసినిమా‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ గద్యాన్ని విడుదల చేసిన బిగ్‌ బి

‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ గద్యాన్ని విడుదల చేసిన బిగ్‌ బి

కలెక్షన్‌ కింగ్‌ డా. మోహన్‌బాబు హీరోగా డైమండ్‌ రత్నబాబు నిర్దేశకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ – శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫిల్మ్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు సంయుక్తంగా నిర్మిస్తున్న సంచలనాత్మక చిత్రం `సన్‌ ఆఫ్‌ ఇండియా`లోని తొలి లిరికల్‌ వీడియో జూన్‌ 15వ తేదీన విడుదలైంది. ‘జయజయ మహావీర’ అనే పల్లవితో సాగే ఈ పాటని ఆలిండియా సూపర్‌ స్టార్‌, బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ విడుదల చేయడం విశేషం. కాగా, డాక్టర్‌ మోహన్‌బాబుపైన అత్యంత ఉద్విగ్నభరితంగా చిత్రీకరించబడిన గీతానికి ఇళయరాజా అందించిన రసవత్తరమైన బాణీలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.

`జయజయ మహావీర` పాటను విడుదల చేసిన బిగ్‌ బి అమితాబ్‌ తన ట్విట్టర్ హేండిల్‌ ద్వారా దీనిపై స్పందించారు. భారతీయ సినీ చరిత్రలో దిగ్గజాల వంటి హీరో మోహన్‌బాబు, సంగీత దర్శకుడు ఇళయరాజా సంయుక్తంగా భగవంతుడు శ్రీరామచంద్రుడి ఘనతకు నివాళులర్పించే రఘువీర గద్యాన్ని అద్భుతంగా సమర్పించారని అభినందనలు తెలియజేశారు. అఖిల భారతస్థాయిలో అత్యున్నత స్థాయి కధానాయకుడైన అమితాబ్‌, డాక్టర్ మోహన్‌బాబు చిత్రగీతాన్ని విడుదల చేయడం ఒక సంచలనమైతే, వ్యక్తిగతంగా ట్వీట్‌ చేసి అభినందనలు, శుబాకాంక్షలు తెలియజేయడం మరో ప్రత్యేక ఆకర్షణగా అందరి దృష్టిని ఆకట్టుకుంది.

దీనికి ముందు మెగాస్టార్‌ చిరంజీవి వ్యాఖ్యానంతో విడుదలైన టీజర్‌ కూడా సోషల్‌మీడియాని కుదిపేసింది. `సన్‌ ఆఫ్‌ ఇండియా` చిత్ర కథానాయకుడితో పాటు స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా మోహన్ బాబు నిర్వహించారు. మోహన్‌బాబు మార్కు డైలాగులు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, ఊహించని మలుపులతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తుది మెరుగులు దిద్దుకుంటోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్