Tuesday, December 3, 2024
Homeతెలంగాణసిఎం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని

సిఎం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిఎం కెసిఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం. వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. సిఎం కెసిఆర్ ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్పెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. సిఎం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని, త్వరలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు.
సీఎం కెసిఆర్ వెంట… మంత్రి కేటీఆర్, ఎంపి జె. సంతోష్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్