Saturday, March 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సిఎం జగన్ ను కలిసిన తిరుపతి ఎంపి

సిఎం జగన్ ను కలిసిన తిరుపతి ఎంపి

తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన డా. గురుమూర్తి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటి జరిగింది. ఉప ఎన్నికలో 2,71,592 ఓట్ల మెజార్టీని సాధించి ఘన విజయం సాధించిన డాక్టర్‌ ఎం. గురుమూర్తిని, పార్టీ నేతలను సిఎం జగన్ అభినందించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ నేతలు భూమన అభినయ్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఎంఆర్‌సీ రెడ్డి కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular